రెండో టెస్టులో ఇద్దరు స్పిన్నర్లతో టీమ్ ఇండియా..

రెండో టెస్టులో ఇద్దరు స్పిన్నర్లతో టీమ్ ఇండియా..

బర్మింగ్‌‌హామ్‌‌: ఇంగ్లండ్‌‌తో బుధవారం (జులై 02) నుంచి జరిగేరెండో టెస్టులో టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగనుంది.  వికెట్ స్పిన్‌‌కు అనుకులించే చాన్స్ ఉండటంతో తుది జట్టులో ఇద్దరు స్పిన్నర్లు ఉంటారని అసిస్టెంట్ కోచ్‌‌ టెన్ దష్కటె తెలిపాడు. 

జడేజాకు తోడుగా కుల్దీప్‌‌ యాదవ్‌‌, వాషింగ్టన్ సుందర్‌‌‌‌లో ఒకరు బరిలోకి దిగనున్నారు. స్టార్ పేసర్ బుమ్రా ఈ మ్యాచ్  ఆడతాడా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. అతని వర్క్‌‌లోడ్‌‌, పిచ్ పరిస్థితిని బట్టి చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుంటామని దష్కటె చెప్పాడు. తొలి టెస్టులో పలు క్యాచ్‌‌లు డ్రాప్ చేసి విమర్శలు ఎదుర్కొంటున్న యశస్వి జైస్వాల్‌‌ను స్లిప్, గల్లీ క్యాచింగ్ నుంచి తప్పించనున్నారు. 

పేస్ ఆల్‌‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ప్లేస్‌‌లో నితీష్ రెడ్డి తుది జట్టులోకి వచ్చే చాన్సుంది. మరోవైపు ఇంగ్లండ్ స్టార్‌‌‌‌ పేసర్ జోఫ్రా ఆర్చర్ రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా సోమవారం తను ప్రాక్టీస్‌‌కు రాలేదు. దాంతో తొలి మ్యాచ్‌‌ తుది జట్టునే కొనసాగిస్తున్నట్టు ఇంగ్లండ్ బోర్డు తెలిపింది.