నిజాముద్దీన్ మృతి పార్టీకి తీరని లోటు : మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి

నిజాముద్దీన్ మృతి పార్టీకి తీరని లోటు : మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి
  • మంత్రి ఉత్తమ్ కుమార్​రెడ్డి

హుజూర్ నగర్, వెలుగు : నిజాముద్దీన్ మరణం పార్టీకి తీరని లోటని ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నిజాముద్దీన్ గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మంత్రి హుజూర్ నగర్ మండలం లింగగిరిలో నిజాముద్దీన్ మృతదేహాన్ని సందర్శించి కాంగ్రెస్ జెండా కప్పి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాముద్దీన్ కాంగ్రెస్ కు చేసిన సేవలు మరువలేనివన్నారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని తెలిపారు. 

లింగగిరి సర్పంచ్, జడ్పీటీసీ, కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడి నిజాముద్దీన్ అందించిన సేవలను కొనియాడారు. మృతుడి కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. నివాళులర్పించిన వారిలో ఏఎంసీ చైర్ పర్సన్ రాధిక అరుణ్ కుమార్ దేశ్ ముఖ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మల్లికార్జునరావు, అల్లం ప్రభాకర్ రెడ్డి, దొంగరి వెంకటేశ్వర్లు, గన్నా  చంద్రశేఖర్, మంజు నాయక్ తదితరులు ఉన్నారు.