
హైదరాబాద్, వెలుగు: రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్పీఎల్) తొలి సీజన్‌లో హైదరాబాద్ హీరోస్ థర్డ్ ప్లేస్ సాధించింది. సెకండ్ రన్నరప్ ప్లేస్ కోసం జరిగిన మ్యాచ్‌లో హీరోస్ 17–12 తేడాతో బెంగళూరు బ్రేవ్‌హార్ట్స్‌ను ఓడించింది. కెప్టెన్ మోరెనో, జోజి నసోవా, కెవిన్ వెకేశా, భూపిందర్ సింగ్ జట్టును గెలిపించారు.
జావేద్ హుస్సేన్‌కు ఇండియన్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు లభించింది. సెమీస్ ఓడి ఫైనల్ చేరలేకపోయిన హైదరాబాద్ ఈ సీజన్‌లో నిలకడగా ఆడింది. టోర్నీలో ఇతర ప్రత్యర్థులను కనీసం ఒక్కసారైనా ఓడించిన ఏకైక జట్టుగా నిలిచింది.
ఈ సీజన్‌లో అత్యధిక ట్రైలు (50), కన్వర్షన్లు (32), టాకిల్స్ (207)తో పాటు ఎక్కువ పాయింట్లు (314) సాధించి సత్తా చాటింది.