పేదలకు ప్రభుత్వ పథకాలను అందిస్తా : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

పేదలకు ప్రభుత్వ పథకాలను అందిస్తా : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: కాంగ్రెస్​ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పథకాలను అమలు చేస్తోందని, వాటిని పేదలకు అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్పారు. జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​ పట్టణంలో నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన కాంగ్రెస్​ సమన్వయ కమిటీ సభ్యుల సమావేశం సోమవారం సాయంత్రం నిర్వహించారు. 

ఎమ్మెల్యే కడియం మాట్లాడుతూ పార్టీలో పాత, కొత్త అనే తారతమ్యాలు లేకుండా, మనందరం కాంగ్రెస్​ పార్టీ కుటుంబ సభ్యులమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ జెండా ఎగురవేయడమే ధ్యేయంగా పార్టీ శ్రేణులు పనిచేయాలన్నారు. జులై4న హైదరాబాద్​లో  జరుగనున్న సమావేశానికి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.