జులై, ఆగస్టులో చేపలు పట్టొద్దు

జులై, ఆగస్టులో చేపలు పట్టొద్దు

నస్పూర్, వెలుగు: జులై, ఆగస్టు నెలలోచేపల్లో ప్రత్యుత్పత్తి జరుగుతుందని, అందుకే ఈ సమయంలో జిల్లాలో చేపలు పట్టడాన్ని నిషేధిస్తున్నామని మంచిర్యాల జిల్లా మత్స్యశాఖ అధికారి ఆర్. అవినాశ్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్, గోదావరి నది, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, రా ళ్లవాగు, గొల్లవాగు, నీల్వాయి ప్రాజెక్టుల్లో చేపలు పట్టడాన్ని నిషేధించామన్నారు. మత్స్యకారులు జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు చేపలు పట్టొద్దని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.