రంజీ ట్రోఫీ హైదరాబాద్ తడబాటు

రంజీ ట్రోఫీ హైదరాబాద్ తడబాటు

జమ్మూ: రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ –డిలో భాగంగా ఆదివారం (నవంబర్ 15) జమ్మూ కశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మొదలైన  మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తడబడింది.   టాస్ ఓడి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దిగిన ఆతిథ్య  జమ్మూ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 47.1 ఓవర్లలో 170 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. ఒక దశలో 32/5తో నిలిచిన  జమ్మూను అబిద్ ముస్తాక్ (57) ఫిఫ్టీతో ఆదుకున్నాడు. 

హైదరాబాద్ బౌలర్లలో కార్తికేయ, తనయ్ త్యాగరాజన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దిగిన హైదరాబాద్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 28 ఓవర్లలో 88/6 స్కోరుతో పీకల్లోతు కష్టాల్లో పడింది.  కెప్టెన్ రాహుల్ సింగ్ (48) ఒక్కడే పోరాడాడు.

ఆకిబ్ నబీ (3/30), సునిల్ కుమార్ (2/15) దెబ్బకు ఓపెనర్లు తన్మయ్ (0), అభిరథ్ రెడ్డి (5)తో పాటు హిమతేజ (0), నితీష్ రెడ్డి (3), రాహుల్ రాదేశ్ (7) ఫెయిలయ్యారు. ప్రస్తుతం తనయ్ త్యాగరాజన్ (13 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), అనికేత్ రెడ్డి (2 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నారు.