రాష్ట్రంలో నేచర్ టూరిజాన్ని ప్రోత్సహిస్తం: రంజిత్‌‌ నాయక్‌‌ 

రాష్ట్రంలో నేచర్ టూరిజాన్ని ప్రోత్సహిస్తం: రంజిత్‌‌ నాయక్‌‌ 

గండిపేట్, వెలుగు :  తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఎకో టూరిజం వింగ్‌‌ పరంగా నేచర్‌‌ క్యాంపులు, ట్రేక్కింగ్, క్యాంపింగ్, బర్డ్‌‌ వాచింగ్, అడ్వైంచర్‌‌ ప్రోగ్రామ్స్ లు నిర్వహించనున్నట్టు టీజీఎఫ్‌‌డీసీ ఎగ్జిక్యూటివ్‌‌ డైరెక్టర్‌‌ రంజిత్‌‌ నాయక్‌‌ తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రకృతి పర్యాటకానికి పెద్దపీఠ వేసి(మద్యం నిషేధిత) నేచర్‌‌ క్యాంపులను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎకో టూరిజం  ప్రోగ్రామ్ లో భాగంగా ఫారెస్ట్‌‌ ట్రెక్‌‌ పార్క్‌‌లో వాన్డేరింగ్‌‌ బీ హాలిడేస్‌‌ ఆర్గనైజేషన్‌‌ సహకారంతో నేచర్‌‌ క్యాంప్‌‌ను నిర్వహించారు.  

ఇందులో హైదరాబాద్‌‌ నలుమూలల నుంచి 20 మంది పాల్గొనగా..  శనివారం సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు ట్రెక్‌‌ జరిగింది.  హాజరైన వారికి ఫారెస్ట్‌‌ రేంజ్‌‌ ఆఫీసర్‌‌ శ్రీనివాస్, ప్రాజెక్ట్స్‌‌ మేనేజర్‌‌ కె.సుమన్, వాండేరింగ్‌‌ బి.రాఘవేంద్ర ప్రసాద్‌‌ నేచర్‌‌ క్యాంప్‌‌ పై అవగాహన కల్పించారు.  క్యాంపింగ్‌‌ సైట్‌‌కి చేరుకోని టెంట్‌‌ ఎలా వేసుకోవాలో డెమో ద్వారా చూపించారు.  భోజనం చేసిన అనంతరం అందరికి రాత్రి దీపాలు(లాంథర్స్‌‌) ఇచ్చి రాత్రి ట్రేక్కింగ్‌‌ చేయించారు.  ట్రేక్కింగ్‌‌ అనంతరం క్యాంపు వద్ద క్యాంపు ఫైర్‌‌ ఏర్పాటు చేసి వారిచే వినోద ప్రోగ్రామ్స్ చేపట్టారు. కార్యక్రమంలో ప్లాంటేషన్‌‌ మేనేజర్‌‌ లక్ష్మారెడ్డి, బోటనిస్ట్‌‌ వీరకిషోర్, నేచురలిస్ట్‌‌లు శ్రీకాంత్, భాస్కర్, అడవెంచర్‌‌ ట్రైనర్స్‌‌ సంతోష్, నరేష్, బాబు, వెంకటేష్‌‌ 
తదితరులు పాల్గొన్నారు.