బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ థియేటర్లలోనే కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై కూడా సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. అయితే, లేటెస్ట్ గా ఈ సినిమా ఊహించని మైలురాయిని తాకింది. ఏకంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ చిత్రానికి సంబంధించిన సోషల్ మీడియా ట్రెండ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
బీజేపీ అఫీషియల్ హ్యాండిల్ సర్ప్రైజ్ వీడియో..
లేటెస్ట్ గా భారతీయ జనతా పార్టీ (BJP) అధికారిక సోషల్ మీడియా ఖాతా ఒక ఆసక్తికరమైన ఎడిటెడ్ వీడియోను షేర్ చేసింది. ఇందులో పీఎం మోడీని 'ధురంధర్: రా అండ్ అందేఖా' (Dhurandhar: Raw and Undekha) ప్రమోషనల్ స్టైల్‌లో చూపించారు. ఒక పాపులర్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ అనౌన్స్‌మెంట్ తరహాలో ఈ వీడియోను క్రియేట్ చేయడం విశేషం. 'ప్రధాని మోడీ నటించిన కొత్త నెట్‌ఫ్లిక్స్ సిరీస్, ధురందర్. సీజన్ 1. ఎపిసోడ్ 1. ప్రత్యక్ష ప్రసారం అవుతోంది!' అంటూ క్రేజీ క్యాప్షన్‌తో ఈ పోస్ట్‌ను వదిలారు.
ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో రణ్‌వీర్ సింగ్ అభిమానులు, నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు. సినిమాలోని హంజా-జస్కీరత్ క్యారెక్టర్, డైలాగులు ఇప్పటికే మీమ్స్ రూపంలో ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు ఏకంగా దేశ ప్రధానికి సంబంధించిన పోస్ట్‌లో దీని రిఫరెన్స్ రావడంతో రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్' క్రేజ్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్ళిపోయింది.
రికార్డుల వేట
ఈ సినిమా కేవలం సోషల్ మీడియాలోనే కాదు, కలెక్షన్ల పరంగానూ చరిత్ర సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా' ధురంధర్ 2' రూ.1,813 కోట్లకుపై కలెక్షన్స్ రాబట్టింది. థియేటర్లలోనేనా కాకుండా, ఓటీటీలో సైతం ఈ మూవీ సంచలనాలు సృష్టిస్తోంది. మొదటి వారంలోనే ఏకంగా 50 మిలియన్లకు వ్యూస్ సాధించి, అంతర్జాతీయంగా టాప్ పొజిషన్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా థియేటర్ల నుండి మొదలై, ఓటీటీ చార్టులను రూల్ చేస్తూ, ఇప్పుడు రాజకీయ వర్గాల సోషల్ మీడియా హ్యాండిల్స్ వరకు చేరిన 'ధురంధర్’' కేవలం ఒక హిట్ సినిమా మాత్రమే కాదు.. ఇదొక బిగ్గెస్ట్ కల్చరల్ ఫినామినన్ అని నిరూపిస్తుంది.
►ALSO READ | లీగల్ చిక్కుల్లో కాజల్ అగర్వాల్ 'ది ఇండియా స్టోరీ: స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్' .. అసలేం జరిగిందంటే?
