గల్లీబోయ్స్ కోసమని మ్యూజిక్ సంస్థను స్థాపించాడు!

గల్లీబోయ్స్ కోసమని మ్యూజిక్ సంస్థను స్థాపించాడు!

‘గల్లీబోయ్‌’ సినిమాలో ర్యాపర్‌‌గా అదరగొట్టేశాడు రణ్ వీర్ సింగ్. అయితే దాన్ని అక్కడితోనే వదిలేయలేదు. దేశంలోని అతి చిన్న గ్రామాల్లో, వీధుల్లో పరిమితమైపోయిన రాప్, హిప్ హాప్ సంగీతాన్ని , కళాకారుల్ని ప్రోత్సహించేందుకు ‘ఇంక్ ఇంక్’ అనే మ్యూజిక్ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా హిప్ హాప్ కళాకారులైన కామ్ భారీ, స్లో చీతా, స్పిట్ ఫైర్ పరిచయం అవ్వబోతున్నారు. ఈ విషయమై రణ్ వీర్ సింగ్ మాట్లాడుతూ ‘రాప్, హిప్ హాప్ సంగీతానికి మంచి రోజులొచ్చాయి. ఈ ప్రభంజనం సంగీత పరిశ్రమకు అత్యంత శుభ సూచకం, అవసరం కూడా. యువత తమ స్వతంత్ర భావాలను వ్యక-్తపరచడానికి రాప్ సంగీతాన్ని ఒక గొప్ప పరికరంలా ఉపయోగించుకుంటోంది. ఎక్కడికెళ్లినా రాప్ హవాని చూడగలుగుతున్నాం. వీరి సంగీతమే మన దేశ స్వరం, మన భవిష్యత్తు’ అంటున్నాడు. తమ సంస్థ ద్వా రా టాలెం ట్ ఉన్నవారిని గుర్తించి
ప్రోత్సహిస్తామని, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి అవకాశం కల్పిస్తామని రణ్ వీర్ చెబుతున్నాడు. నిజంగా ప్రశంసించాల్సిన విషయం కదూ!