రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్' ఫస్ట్ లుక్: బీస్ట్ మోడ్‌లో అదరగొట్టిన హీరో!

రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్' ఫస్ట్ లుక్:  బీస్ట్ మోడ్‌లో అదరగొట్టిన హీరో!

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్( Ranveer Singh ) ' ధురంధర్ ' ( Dhurandhar )  ఫస్ట్ లుక్ ఇంటర్నెటో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆయన  పుట్టిన రోజును సందర్భంగా మూవీ మేకర్స్ దీనికి రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. విడుదల చేసిన 8 గంటల్లోనే యూట్యూబ్ లో 70 లక్షలకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుని టాప్ వన్ లో నిలిచింది.  దాదాపు ఏడాది  విరామం తర్వాత వెండితెరపైకి వస్తున్న రణ్‌వీర్,  ఈ ఫస్ట్ లుక్‌ టీజర్‌లో మునుపెన్నడూ చూడని క్రూరమైన, తీవ్రమైన అవతార్‌లో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. 

టీజర్‌తోనే షాకిచ్చిన రణ్‌వీర్: 'బీస్ట్ మోడ్' ట్రెండింగ్!
ఈ మూవీని దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందిద్దుకుంటోంది. దాదాపు రెండు నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ టీజర్ రణ్‌వీర్‌ను గుర్తుపట్టలేనంతటి భయంకరమైన లుక్‌తో ప్రారంభమవుతుంది. ఆయనలోని అపారమైన శక్తి, తీవ్రత క్షణాల్లోనే ఈ గ్రిట్టీ యాక్షన్ డ్రామాకు టోన్ సెట్ చేశాయి. రణ్‌వీర్ సింగ్ మేకోవర్ చూసి అభిమానులు షాక్ అయ్యారు. దేశంలో అత్యంత శక్తివంతమైన నటులలో ఒకరిగా అతని స్థానాన్ని ఈ టీజర్ మరోసారి నిరూపించిందంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు. 

 

భారీ తారాగణం: పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌లు ఖాయం!
'ధురంధర్'లో రణ్‌వీర్ సింగ్‌తో పాటు, భారీ తారాగణం ప్రేక్షకులను అలరించనుంది. సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా వంటి అగ్ర నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టీజర్‌లో వారి ఆసక్తికరమైన లుక్స్ శక్తివంతమైన ప్రదర్శనలతో నిండిన ఒక పదునైన కథాంశాన్ని సూచిస్తుందని బాక్సాఫీస్ బద్దలు కొట్టడం ఖాయం అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు. ఈ చిత్రంలో వర్ధమాన నటి సారా అర్జున్ రణ్‌వీర్ సరసన హీరోయిన్‌గా నటిస్తూ, కథకు ఒక కొత్త డైనమిక్‌ను జోడించనుంది. 

టీజర్ విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు వైరల్ గా మారింది. రణ్‌వీర్ భయంకరమైన స్క్రీన్ ప్రెజెన్స్, అయస్కాంత శక్తికి అభిమానులు మంత్రముగ్ధులై, 'బీస్ట్ మోడ్' అనే పదాన్ని  X లో ట్రెండ్ చేస్తున్నారు. ఆయనలోని అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్‌ను చూసి సినీ విశ్లేషకులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.  ఈ చిత్రం రణ్‌వీర్‌కు మరోసారి భారీ విజయాన్ని  తెచ్చిపెట్టే విధంగా ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.  అయితే ఈ మూవీలో రణ్‌వీర్ ఈసారి ఏకంగా విలన్‌గా కనిపించబోతున్నాడా, లేక ప్రతీకారం తీర్చుకునే పాత్రలో కనిపిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. 'ధురంధర్' భారతీయ బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి మరి.