
- నిజామాబాద్ 6వ పట్టణ పరిధిలో దారుణ ఘటన
నిజామాబాద్: నగరంలోని 6 వ టౌన్ పరిధిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అభం శుభం తెలియని ఇద్దరు మైనర్ అమ్మాయిల పై వసీం అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. బాధిత మైనర్లలో ఒకరికి 8 ఏళ్లు కాగా మరో బాలికకు 11 ఏళ్లు మాత్రమే. వసీం అనే వ్యక్తి చాక్లెట్ల ఆశ చూపి గత కొన్ని రోజులుగా అత్యాచారం చేస్తున్నాడు.
బాధిత బాలికలను చికిత్స నిమిత్తం అమ్మాయిలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలికల తల్లి తండ్రుల పిర్యాదుతో నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందితున్ని కాపాడేందుకు 6 టౌన్ ఎస్ఐ ప్రయత్నించాడని బాధితుల ఆరోపిస్తున్నారు.