యువతకు పార్ట్ టైం జాబ్‌గా ర్యాపిడ్ రైడ్

యువతకు పార్ట్ టైం జాబ్‌గా ర్యాపిడ్ రైడ్

పైసాకేలియే ర్యాపిడ్ రైడ్

పాకెట్ మనీ కోసం పార్ట్ టైం జాబ్

బైక్ రైడ్‌ను ఎంచుకుంటున్న యూత్

ఓ వైపు చదువు.. మరో వైపు సంపాదన

హైదరాబాద్, వెలుగు: సిటీలో ర్యాపిడ్ రైడ్ చేసే యూత్ సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా స్టూడెండ్స్‌లో ఈ ధోరణి అధికమైంది. పాకెట్ మనీ కోసం పార్ట్​ టైం జాబ్స్ చేస్తూ సంపాదిస్తున్నారు. ప్రతి సారి పేరెంట్స్ మీద ఆధారపడకుండా చాలామంది నిరుద్యోగులు, విద్యార్థులు బాధ్యతాయుతంగా పనిచేస్తున్రు. ఓ వైపు చదువుకుంటూ, మరోవైపు డైలీ ఖర్చుల కోసం ఇతరులపై డిపెండ్ కాకుండా ఈ జాబ్స్ చేయడం ఆనందంగా ఉందని పలువురు విద్యార్థులు చెబుతున్నారు. వివిధ సంస్థల్లో, షాపులు, ఇతర రంగాల్లో నిత్యం పార్ట్​ టైం చేయడం కంటే సొంత వాహనం కల్గి ఉంటే, ఆన్‌లైన్ సంస్థల్లో కొరియర్ బాయ్‌గా పనిచేయడం బెటర్ అని మరికొందరు అభిప్రాయపడుతున్నరు. తక్కువసమయంలో ఎక్కువ మనీ వస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన ఆన్‌లైన్ కొరియర్ సంస్థల మీద స్డూడెంట్స్ ఎక్కువ ఇంట్రెస్టు చూపుతున్నరు. సమయం దొరికినప్పుడు మాత్రమే లాగిన్ అయ్యే అవకాశం ఉండటంతో చాలా మంది యూత్ దీని మీదనే ఆధిక ఆసక్తి చూపుతున్నారు. ఇలా బాధ్యతాయుతంగా పనిచేయడం వలన సెల్ఫ్ కాన్ఫిడెంట్ లెవల్స్ కూడా పెరుగుతున్నాయని యవకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా తమ బిడ్డలు బాధ్యతాయుతంగా వ్యవహరించడం పట్ల పేరెంట్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్రు.

సిటీలో ఇలా..

నిత్యం బిజీబిజీగా ఉండే సిటీలో చాలా మంది స్టూడెంట్స్ స్వీయ సంపాదనపై దృష్టి సారిస్తున్నారు. కాంపిటేటీవ్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్లు, చదువుకునే విద్యార్థులు వారి డైలీ ఖర్చుల కోసం పేరెంట్స్‌ని ఇబ్బందులు పెట్టకూడదనే దృక్పథంతో సొంతంగా పనిచేసేందుకు ఇష్టపడుతున్నరు. అయితే దుకాణాలు, ఇతర రంగాల్లో సంస్థలు నిర్ణయించిన సమయానికి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కావున ఆన్‌లైన్ యాప్ సర్వీసులపైనే ఎక్కువ మంది ఆధారపడుతున్నరు. ముఖ్యంగా ర్యాపిడ్ రైడ్ చేసేవాళ్ల సంఖ్య అధికమవుతోంది. సొంత వాహనం ఉంటే, ర్యాపిడ్ రైడ్ అనేది అన్నిటి కన్నా బెస్ట్​ పార్ట్​ టైం జాబ్ అని ఎక్కువ శాతంమంది స్టూడెంట్స్ అభిప్రాయం. కేవలం నాలుగు గంటల్లో సుమారు రూ. 300 నుంచి రూ.400 వరకు సంపాదించవచ్చని చెబుతున్నరు. సిటీలో ర్యాపిడ్ సర్వీస్ ప్రారంభమైన అతి తక్కువ సమయంలోనే సుమారు 10 వేల మంది ఉద్యోగులు సేవలు అందిస్తున్నారని ర్యాపిడ్ సంస్థకి చెందిన కో–ఆర్డినేటర్ విజయ్ తెలిపారు. టైం వారీగా ఆప్షన్లు ఉండటంతో ఎక్కువ మంది ర్యాపిడ్‌తో పార్ట్​ టైం జాబ్స్ చేస్తున్నారని సంస్థకు చెందిన ప్రతినిధులు చెబుతున్నరు. సాయంత్రం 4.30 నుంచి రాత్రి 10.30 వరకు ఎక్కువమంది పార్ట్​ టైం రైడ్స్ కొడుతున్నారని, ప్రతి రోజూ ఈ సమయంలో 3 వేల మంది స్టూడెంట్స్ నిత్యం సిటీ కస్టమర్లకు సేవలందిస్తున్నారని విజయ్ పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10.30 వరకు పార్ట్​ టైం జాబ్ వాళ్లకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఒక్కసారి లాగిన్ అయ్యాక కనీసం 4 గంటల వరకు రైడ్స్ చేయాల్సిన అవసరం ఉంటుందని ర్యాపిడ్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. పుల్ టైం చేసే వారు ప్రతిరోజు 10 నుంచి 15 రైడ్స్ చేస్తూ సుమారు రూ. 900వరకు సంపాదిస్తున్నారని విజయ్ పేర్కొన్నారు. ర్యాపిడ్ సంస్థలో విద్యార్థులే కాకుండా ఐటీ రంగం,ఇతర రంగాల్లో పనిచేసే వారు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకొని సమయం దొరికినప్పుడల్లా రైడ్స్ చేస్తున్నారని విజయ్ తెలిపారు.

ఎక్కువగా స్టూ డెంట్సే..

ర్యాపిడ్ రైడ్ చేసే వారిలో ఎక్కువగా స్టూడెంట్స్ ఉంటున్రు. ప్రతి కిలో మీటరుకు రూ.4 వరకు చెల్లిస్తు న్నాం. ప్రతి రోజూ కస్టమర్ చెల్లించేదానిలో 70 శాతం రైడర్‌కి, 30 శాతం ర్యాపిడ్ సంస్థకు వెళ్తుంది. సిటీ ట్రాఫిక్‌లో ర్యాపిడ్ రైడ్లకు అద్భుతమైన రెస్పాన్స్ ఉంది.- విజయ్,ర్యాపిడ్ రైడ్ కో-ఆర్డినేటర్

4 గంటల్లో 300 సంపాదిస్తున్నా..

నేను మేడ్చల్‌లో బీటెక్ చదువుతున్నాను. కాలేజీ సమయం పూర్తికాగానే సుచిత్రలో ర్యాపిడ్ యాప్ లాగిన్ అయితా. సాయంత్రం 4.30 నుంచి రాత్రి 10.30 వరకు రైడ్స్ చేసి సుమారు రోజూ 300 నుంచి 400 వరకు సంపాదిస్తున్నాను. ఖర్చుల కోసం మాపేరెంట్స్ పై ఆధారపడాకుండా పనిచేయడం గర్వంగా ఉంది.- రాజేశ్, బీటెక్ స్టూడెంట్

బెస్ట్ ​పార్ట్ టైం జాబ్ ర్యాపిడ్

మూడేళ్ల నుంచి సిటీలో ఉండి కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా . నోటిఫికేషన్లు లేక జాబ్‌లు వస్తలేవు. ర్యాపిడ్ యాడ్ చూసిఫోన్‌లో డౌన్ లోడ్ చేసుకున్నా. సమయం ఉన్నప్పుడు మాత్రమే లాగినే అయ్యే అవకాశం ఉన్నందున ఇది బెస్ట్ పార్ట్​ టైంజాబ్. నా ఖర్చులకు సొంతంగా సంపాదించుకోవడం ఆనందంగా ఉంది.

– శ్యాం ప్రసాద్, స్టూ డెంట్

For More News..

లారీ డ్రైవర్‌‌‌‌గా అల్లు అర్జున్?

తమ ఓటు తామే వేసుకోని వార్డు మెంబర్లు

స్మార్ట్‌ ఫోన్ల వాడకంలో అమెరికాను దాటిన భారత్