
చందానగర్: రెడిమిక్స్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో ఓ ర్యాపిడో బైక్ డ్రైవర్ మృతి చెందాడు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం రాళ్ల బౌజరాకు చెందిన గుర్రం వెంకటరామారావు(28) నల్లగండ్లలో ఉంటూ ర్యాపిడో బైక్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం నల్లగండ్ల నుంచి లింగంపల్లి వైపు వెళ్తున్నాడు. ఫ్లైఓవర్ పైన ఉన్న సిగ్నల్ దగ్గర ఆగి ఉండగా వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన రెడిమిక్స్ ట్యాంకర్ అతని బైక్ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకట రామారావును స్థానికులు హాస్పిటల్కు తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందాడు. కొత్తూరులో లారీ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. జెండాగూడెం మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి(50) నందిగామ మండలం దేవుని మామిడిపల్లికి చంద్రశేఖర్ రెడ్డి(45)తో కలిసి బుధవారం అర్ధరాత్రి కారులో జెండాగూడెం వెళ్తున్నాడు. దారిలో వీరి కారును ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఇద్దరూ చనిపోయారు.