స్పెర్మ్ డోనార్ విషయంలో పొరపాటు.. 10 మంది పిల్లలకు క్యాన్సర్, ఏమైందంటే..?

స్పెర్మ్ డోనార్ విషయంలో పొరపాటు.. 10 మంది పిల్లలకు క్యాన్సర్, ఏమైందంటే..?

Sperm Donor: చాలా కాలం నుంచి మహిళలు సంతానం కోసం స్పెర్మ్ డోనార్ల నుంచి తీసుకున్న వీర్యంతో పిల్లలను కనటం సాధారణంగా మారింది. అయితే యూరప్ దేశంలో ఒక స్పెర్మ్ డోనా నుంచి తీసుకున్న వీర్యంలో ఉన్న అరుదైన జన్యువు కారణంగా దాని ద్వారా పుట్టిన పిల్లలు క్యాన్సర్ బారిన పడినట్లు వెల్లడైంది. అయితే అతని వీర్యం ద్వారా మెుత్తం 46 కుటుంబాల్లో 67 మంది పిల్లలు పుట్టారు.

కేవలం ఒక్క డోనార్ నుంచి తీసుకున్న వీర్యాన్ని ఎంత మందికి వాడాలి అనేదానిపై ఆంక్షలు పెట్టాలని ప్రస్తుత పరిస్థితితో డిమాండ్ పెరుగుతోంది. వాస్తవానికి సదరు స్పెర్మ్ డోనార్ వీర్యం ద్వారా2008 నుంచి 2015 మధ్య పిల్లలు పుట్టినట్లు ఫ్రాన్స్‌లోని రూయెన్ యూనివర్శిటీ హాస్పిటల్‌లో జీవశాస్త్రవేత్త ఎడ్విజ్ కాస్పర్ వెల్లడించారు. ఇప్పటికే పుట్టిన మెుత్తం 67 మందిలో 10 మందికి క్యాన్సర్ ఉన్నట్లు తేలిందని శాస్త్రవేత్త వెల్లడించారు. అయితే వీర్యం వినియోగంపై సరైన నిబంధనలు లేకపోవటమే దీనికి కారణంగా ఆమె పేర్కొన్నారు. 

వాస్తవానికి వీర్యం అందించిన డోనార్ ఆరోగ్యంగానే ఉన్నాడు. అయితే అతనికి ఉన్న TP53 అనే అరుదైన జీన్ మ్యూటేషన్ పుట్టిన పిల్లలో క్యాన్సర్ రావటానికి కారణమైందని గుర్తించారు. ఈ జీన్ లి-ఫ్రామిని సిండ్రోమ్ కి కారణంగా మారినట్లు పరిశోధనల్లో వెల్లడైంది. సదరు డోనార్ వీర్యం నుంచి పుట్టిన పిల్లలు ప్రస్తుతం యూరప్ వ్యాప్తంగా బెల్జియం, డెన్మార్క్, ఫ్రాన్స్, జెర్మనీ, గ్రీస్, స్పెయిన్, స్వీడన్, యూకే దేశాల్లో పుట్టినట్లు గుర్తించబడింది. ప్రస్తుతం ఈ పిల్లలకు వైద్యం అందిస్తున్నారు. పైగా వీరికి భవిష్యత్తులో పుట్టే పిల్లలకు కూడా ఈ జీన్ వల్ల క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంటుందని నిపుణులు వెల్లడించారు. 

పిల్లల్లో తొలినాళ్లలోనే క్యాన్సర్ గుర్తించటం వల్ల వారి ప్రాణాలు కాపాడి ఎక్కువకాలం జీవించేందుకు వీలు ఏర్పడిందని శాస్త్రవేత్త పేర్కొన్నారు. దీనికి ముందు ఒక డచ్ వ్యక్తి డెన్మార్క్ లోని యూరోపియన్ స్పెర్మ్ బ్యాంక్ కి ఇచ్చిన వీర్యం కారణంగా 500 నుంచి 600 మంది పిల్లలు పుట్టిన తర్వాత అతని నుంచి వీర్యం తీసుకోవటం నిలిపివేయబడింది.  అందుకే ఇలాంటి రిస్క్ తగ్గించటానికి వ్యక్తి వీర్య వినియోగంపై కొన్ని పరిమితులు అవసరమని నిపుణులు అంటున్నారు.