ఆర్వీఎం హాస్పిటల్లో అరుదైన మోకాలి చికిత్స

ఆర్వీఎం హాస్పిటల్లో అరుదైన మోకాలి చికిత్స

ములుగు, వెలుగు: సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మకపల్లిలోని ఆర్వీఎం హాస్టిటల్​డాక్టర్లు మంచానికే పరిమితమైన వ్యక్తికి అరుదైన మోకాలి చికిత్స చేశారు. కరీంనగర్​జిల్లా వీణవంక మండలం శ్రీరాములపేటకు చెందిన జానగిరి మల్లయ్యకు మోకాళ్లు పూర్తిగా అరిగిపోయి కొన్ని రోజులుగా మంచానికే పరిమితమయ్యాడు. కుటుంబ సభ్యులు మల్లయ్యను చాలా ఆస్పత్రుల్లో చూయించినా ఎక్కడా చికిత్స చేయలేదు. 

చివరకు ఆర్వీఎం హాస్పిటల్​గురించి తెలుసుకొని ఇక్కడికి తీసుకువచ్చారు.ఆర్వీఎం డాక్టర్లు మల్లయ్యకు అన్ని పరీక్షలు ఉచితంగా చేసి డాక్టర్​అవినాశ్, వంశీకృష్ణ​ ఆధ్వర్యంలో శస్త్ర చికిత్స చేశారు.  ఆపరేషన్​ విజయవంతం కావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి డైరెక్టర్​గోపికృష్ణ, సీఈవో దేవరకొండ శ్రీనివాస్​రావు, సూపరింటెండెంట్​శ్రీనివాస్, మార్కెటింగ్​మేనేజర్​మంచినీళ్ల లక్ష్మణ్ కు ధన్యవాదాలు తెలిపారు.