Rare Ring Of Fire : ఆకాశంలో ఖగోళ అద్భుతం.. చూసి థ్రిల్ అయిన ప్రజలు

Rare Ring Of Fire : ఆకాశంలో ఖగోళ అద్భుతం.. చూసి థ్రిల్ అయిన ప్రజలు

శనివారం అక్టోబర్ 14న ఆకాశంలో ఖగోళ అద్భుతం జరిగింది. సూర్యగ్రహణం సందర్భంగా అద్భుత దృశ్యం కనిపించింది. చంద్రుడు, సూర్యుడిని ఎదురుగా వెళుతున్న క్షణంలో ఆకాశంలో అగ్ని వలయం (రింగ్ ఆఫ్ ఫైర్) లాంటి అరుదైన దృశ్యం ఏర్పడింది. యూఎస్ దక్షిణ అమెరికా లాంటి దేశాల్లో ఈ అద్భుతాన్ని చూసి ప్రజలు ఎంతో థ్రిల్లింగ్ పొందారు. 

అమెరికా పసిఫిక్ నార్త్ వెస్ట్, కాలిఫోర్నియా, నెవాడా, ఉటా, అరిజోనా, న్యూ మెక్సికో, టెక్సాస్, మెక్సికో, గ్వాటెమాల, బెలిజ్, హోండురాస్, నికరాగ్వా, పనామా, కొలంబియా, బ్రెజిల్ లోని పలు ప్రాంతాల్లో సూర్యగ్రహణం ఏర్పడిందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తెలిపింది. 

Also Read :- దాడులు తీవ్రతరం చేస్తాం ఖాళీ చేయండి..

యుకాటాన్ ద్వీపకల్పం లోని కాంపేచెలో నెమ్మదిగా ఉదయిస్తున్న సూర్యుడిముఖం మీదుగా చంద్రుడి జారిపోతున్న అద్బుత దృశ్యాలను అక్కడి ప్రజలు తిలకించారు. సన్ గ్లాసెస్ ధరించి ఈ అద్భుత దృశ్యాన్ని చూసి ఎంజాయ్ చేసింది. 

చంద్రుడు భూగ్రహం నుంచి అత్యంత దగ్గరలోగానీ, అత్యంత దూరంలోగానీ ఉన్నపుడు సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు ప్రవేశించినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహం వలె కాకుండా సూర్యుడిని అస్పష్టంగా కనిపించేలా  చేస్తుంది. అప్పుడు భూమి వైపు ఉన్న చంద్రుని భాగం సూర్యుని రూపురేఖలపై అద్భుతమైన రింగ్ చిత్రాన్ని ఏర్పరుస్తుంది.