ఇజ్రాయెల్, హమాస్ వార్: దాడులు తీవ్రతరం చేస్తాం ఖాళీ చేయండి..

ఇజ్రాయెల్, హమాస్ వార్: దాడులు తీవ్రతరం చేస్తాం ఖాళీ చేయండి..

హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులతో గాజా వణికిపోతోంది. హమాస్ తీవ్రవాద దాడి తర్వాత గాజాపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులతో  గాజా అల్లకల్లోంగా మారింది. తాజాగా ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా గాజాపై భూతల దాడులు చేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరికలు చేసింది.. గాజాను అన్ని వైపులా భూతల దాడులు చేస్తామని.. పౌరులు వెంటనే గాజాను ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించింది. 
ఉత్తర గాజాలో నివసిస్తున్న 1.1 మిలియన్ల మంది ప్రజలు తమ భద్రత కోసం దక్షిణాదికి ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. 

గాజాలో మృతుల సంఖ్య 2,329కి చేరింది
ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజాలో ఇప్పటికే కనీసం 2వేల 329 మంది పాలస్తీనియన్లు మరణించారు. 9వేల714 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.