ఏనుగుల గుంపుకు దారిచ్చిన పులి.. విస్మయానికి గురిచేస్తోన్న వీడియో

ఏనుగుల గుంపుకు దారిచ్చిన పులి.. విస్మయానికి గురిచేస్తోన్న వీడియో

పులులంటే ఎవరికి మాత్రం భయముండదు. ఎందుకంటే అత్యున్నత మాంసాహారులుగా ప్రసిద్ధి గాంచిన జంతువులు గనక. సాధారణంగా పులులు జింకలు, కోతులు, పందులు వంటి పెద్ద లేదా మధ్యస్థ-పరిమాణ క్షీరదాలను వేటాడడం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఏనుగులను వేటాడే సందర్భాలు చాలా అరుదు. కొన్నిసార్లు అడవిలోని జంతువులు తమ మధ్య కమ్యూనికేషన్ ను చేతల్లో చూపిస్తూ ఉంటాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో అడవిలోని అత్యంత ఆకర్షణీయమైన రెండు జంతువుల మధ్య పరస్పర గౌరవం, సామరస్యం వంటి అరుదైన లక్షణాన్ని చూపిస్తోంది.

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి సుశాంత నందా షేర్ చేసిన ఈ వైరల్ వీడియోలో ఏనుగుల మంద చెట్ల మధ్యలో నుంచి వస్తుండగా.. ఆ సమయంలో ఆ దారినే వెళ్తు పులి.. ఏనుగుల గుంపును గమనించి ఓ పక్కకు దాక్కున్నట్టుగా ఉండిపోయింది. ఏనుగులు వెళ్లిపోయిన తర్వాత పులి అక్కడ్నుంచి అడవిలోకి వెళ్లిపోయింది. మామూలుగా పులి అంటే అందరికీ భయమే.. అత్యంత విస్మయాన్ని కలిగించే ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియోని నిజానికి వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ విజేత సింహా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు. ఆ తర్వాత IFS అధికారి ట్విట్టర్ లో షేర్ చేశారు.

ట్విట్టర్ లో వైరల్ అవుతోన్న ఈ వీడియోకు ఇప్పటివరకు 38వేల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోతో పాటు, "జంతువులు ఇలా కమ్యూనికేట్ చేస్తాయి & సామరస్యాన్ని కాపాడుకుంటాయి... ఏనుగు పులిని వాసన చూస్తుంది. రాజు టైటాన్ మందకు దారి ఇస్తాడు" అని క్యాప్షన్ ను కూడా ఐఎఫ్ఎస్ అధికారి రాసుకొచ్చారు.

https://twitter.com/susantananda3/status/1652662175473778689