2022లో 5819 డ్రైవింగ్ లైసెన్స్లు సస్పెన్షన్

 2022లో 5819 డ్రైవింగ్  లైసెన్స్లు సస్పెన్షన్

హైదరాబాద్ లో ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఏటేటా పెరిగిపోతున్నాయి. కౌన్సిలింగ్ ఇచ్చినా వాహనదారుల్లో మార్పు రావటంలేదు. రిపీటెడ్ గా ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుపడుతున్నారు. ఆర్టీఏ అధికారులు ఇలాంటి వారి లైసెన్సులను సస్పెన్షన్ లో పెడుతున్నారు. 2021లో 2వేల 599 మంది డ్రైవింగ్ లైసెన్సులను సస్పెన్షన్ లో ఉంచగా.. 2022లో ఆ సంఖ్య 5819కి చేరింది. హైదరాబాద్ సిటీ పరిధిలోని ఐదు ఆర్టీఏ జోన్లలోనూ అధికారులు భారీగా డ్రైవింగ్ లైసెన్సులు సస్పెండ్ చేశారు .