
అప్గనిస్తాన్ టీ20 కెప్టెన్ గా రషీద్ ఖాన్ మరోసారి ఎంపికయ్యాడు. మహ్మద్ నబీ స్థానంలో లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ను నియమించారు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ మహ్మద్ నబీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. లేటెస్ట్ గా బోర్డు మరోసారి రషీద్ ఖాన్ ను నియమించింది. 2021 టీ20 వరల్డ్ కప్ ముందుకు రషీద్ ఖాన్ కెప్టెన్ గా ఉన్నాడు. బోర్డు నిర్ణయాల వల్ల అతను కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.
"రషీద్ ఖాన్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్లో గొప్ప పేరుంది. రషీద్ ఖాన్‌కు ఇంతకుముందు మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ అనుభవం ఉంది . ఇది జట్టును ముందుకు తీసుకెళ్లడంలో ఉపయోగపడుంది. అతను మళ్లీ T20 ఫార్మాట్‌కు కెప్టెన్‌గా ఉండటం మాకు సంతోషంగా ఉంది. అతను అగ్రస్థానంలోకి వచ్చి దేశానికి మరిన్ని కీర్తిని తెస్తాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను" అని అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు మిర్వైస్ అష్రాఫ్ ఓ ప్రకటనలో తెలిపాడు.
కెప్టెన్సీ అనేది చాలా పెద్ద బాధ్యత అని రషీద్ ఖాన్ అన్నాడు. ఇంతకు ముందు నా కెప్టెన్సీ చేసిన అనుభవం ఉందని..జట్టులో ఉన్నారని తామంతా కలిసి దేశానికి కీర్తి ప్రతిష్టలు తెసతామని అన్నాడు. ఇప్పటి వరకు 74 టీ20ల్లో 122 వికెట్లు తీశాడు.