అవును నిజమే.. రెండో పెళ్లి చేసుకున్నా: సెకండ్ మ్యారేజ్‎పై రషీద్ ఖాన్ క్లారిటీ

అవును నిజమే.. రెండో పెళ్లి చేసుకున్నా: సెకండ్ మ్యారేజ్‎పై రషీద్ ఖాన్ క్లారిటీ

కాబూల్: ఆప్ఘానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ రెండో వివాహం చేసుకున్నాడంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సెకండ్ మ్యారేజ్‎పై స్వయంగా రషీద్ ఖాన్ క్లారిటీ ఇచ్చాడు. రెండో పెళ్లి చేసుకుంది నిజమేనంటూ ఇన్‎స్టా గ్రామ్ వేదికగా ఊహాగానాలకు చెక్ పెట్టాడు. 2025, ఆగస్ట్ 2న సెకండ్ మ్యారేజ్ చేసుకుని జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించానని వెల్లడించాడు. 

తనకు ఎంతో ఇష్టపడే మహిళను పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. నేను ఇటీవల నా భార్యను ఒక ఛారిటీ ఈవెంట్‌కు తీసుకువెళ్లానని, కానీ దురదృష్టవశాత్తు దీని గురించి ప్రజలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈవెంట్లో తనతో పాటు ఉన్న మహిళ తన భార్యేనని.. ఇందులో దాచడానికి ఏమి లేదని కుండబద్దలు కొట్టాడు. దీంతో రషీద్ సెకండ్ మ్యారేజ్‎పై ఒక క్లారిటీ వచ్చింది. 

ఇటీవల రషీద్ ఖాన్ ‘ఖాన్ ఛారిటీ ఫౌండేషన్’ ప్రారంభించాడు. ఈ కార్యక్రమానికి రషీద్ ఖాన్‎ ఓ అమ్మాయితో హాజరయ్యాడు. రషీద్, ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. దీంతో ఆ అమ్మాయి ఎవరనే దానిపై చర్చ నెట్టింట చర్చ మొదలైంది. రషీద్ ఖాన్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడని.. ఆమె రషీద్ రెండో భార్య అని ఊహాగానాలు వినిపించాయి. ఈ క్రమంలో సెకండ్ మ్యారేజ్ పై స్వయంగా ఈ స్టార్ స్పిన్నరే క్లారిటీ ఇచ్చాడు. అయితే.. 2024 అక్టోబర్‎లోనే రషీద్ ఖాన్‎కు మ్యారేజ్ అయ్యింది. వ్యక్తిగత కారణాలతో మొదటి భార్యతో రషీద్ విడాకులు తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే 2025, ఆగస్ట్‎లో రషీద్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు.