
హైదరాబాద్: తాలిబన్ల ఆక్రమణతో అఫ్గానిస్తాన్‌లో ఇప్పటికే అల్లకల్లోల పరిస్థితులు ఉన్నాయి. తాజాగా అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) తీరు వల్ల ఆ దేశ క్రికెట్‌లోనూ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీ20 వరల్డ్‌కప్ బరిలోకి దిగే జట్టును గురువారం ప్రకటించిన ఏసీబీ.. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు కెప్టెన్సీ అప్పగించింది. కానీ ఈ అనౌన్స్‌మెంట్ వచ్చిన కొన్ని గంటల్లోనే రషీద్ తన కెప్టెన్సీని వదులుకున్నాడు. టీమ్ సెలెక్షన్ విషయంలో బోర్డు తనతో కనీస సంప్రదింపులు కూడా జరపలేదని, అందువల్ల జట్టును నడిపించలేనని రషీద్ ఆరోపించాడు. ఈ నిర్ణయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. రషీద్ తప్పుకోవడంతో సీనియర్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ జట్టు పగ్గాలు అందుకోనున్నాడు. నబీ నియామకంపై ఏసీబీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.