రష్మీ లైట్​ తీసుకుంటుందా?

రష్మీ లైట్​ తీసుకుంటుందా?

బుల్లితెర యాంకర్​ రష్మీకి ఎంతో మంది అభిమానులున్నారు. హీరోయిన్​ అవ్వబోయి.. యాంకర్​గా సెటిలైన ఈ బ్యూటీ ప్రస్తుతం స్టార్​ రేంజ్​ను చూస్తోంది. అయినా, ఆమె ఫ్యాన్స్​ కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

ఓ షోలో భాగంగా రష్మీని.. ఓ కమెడియన్​ అవమానించాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కిట్​లో భాగంగా డబుల్​ మీనింగ్​ డైలాగులు మాట్లాడటంపై ఫైర్​ అవుతున్నారు. రష్మీ ఇప్పటికైనా ఇలాంటి షోస్​ను విడిచిపెట్టి నటిగా యాక్టింగ్​పై దృష్టి పెట్టాలని ఆమె ఫ్యాన్స్​ కోరుతున్నారు. ఇప్పటికే రష్మీ ‘గుంటూరు టాకీస్​’ వంటి  సినిమాల్లో కీ రోల్​లో నటించింది. 

తర్వాత అనుకున్న రేంజ్​ సక్సెస్​ రాకపోవడంతో తిరిగి బుల్లితెరపైనే బిజీగా మారింది. మరి కొందరు మాత్రం ఇలాంటివి వారు చాలా లైట్​ తీసుకుంటారని అంటున్నారు. గతంలోనూ యాంకర్​ విష్ణుప్రియను బాడీషేమింగ్​ చేయడం కాంట్రవర్సీగా మారింది.