
పుష్ప 2’ సినిమాలో రష్మిక రోల్‌పై ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా చివర్లో రష్మిక పాత్ర చనిపోతుందంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లోనూ ఎక్కడా హీరోయిన్ను దర్శకుడు సుకుమార్ రివీల్ చేయలేదు. దీంతో అంతా అదే నిజమని నమ్మేశారు. రష్మిక చనిపోయే సీన్లోదంటూ ఓ ఫొటో సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తాజాగా ఈ ఫొటోలో ఉన్నది రష్మిక కాదని తేలింది. ‘నయ్ వరణ్ భట్ లోంచా కోన్ నాయ్ కొంచ’ అనే మరాఠి సినిమా హీరోయిన్ ఇషా దనేకర్ అచ్చం రష్మిక పోలికలతో ఉంది. 2022లో విడుదలైన ఈ సినిమాలో ఆమె పాత్ర చనిపోతుంది. ఆ ఫొటోను రష్మిక పేరుతో వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రూమర్‌కు చెక్ పడినట్టయ్యింది.
అయితే, కథ డిమాండ్ మేరకు పుష్ప 2లో రష్మిక పాత్ర నిడివిని చాలావరకు తగ్గించేశారనే టాక్ కూడా నడుస్తోంది.