
తక్కువ సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను అందుకోవడంతో పాటు ఇతర భాషల్లోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది రష్మిక మందాన్న. లాస్ట్ ఇయర్ బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రాకి జంటగా ‘మిషన్ మజ్ను’, అమితాబ్‌తో కలిసి ‘గుడ్ బై’ చిత్రాల్లో నటిస్తోంది. ఇవి రెండే కాక ఈ ఇయర్ ఆమె బాలీవుడ్‌లో మరింత బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ప్రొడక్షన్‌లో రష్మిక నటించబోతోందనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల ముంబై వెళ్లిన రష్మిక, కరణ్ జోహార్‌ను మీట్ అవడంతో ఈ కాంబినేషన్‌పై బజ్ మొదలైంది. రష్మిక రీసెంట్ మూవీ ‘పుష్ప’ హిందీలోనూ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కరణ్ జోహార్ కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఈ సినిమాని తెగ పొగిడేశాడు. ఈ సినిమాలో శ్రీవల్లిగా రష్మిక యాక్టింగ్ టాలెంట్ కరణ్‌ని ఆకర్షించిందంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఇదే నిజమై కరణ్ అవకాశం ఇస్తే రష్మిక కెరీర్‌లో నెక్స్ట్ స్టెప్ పడినట్టే. విజయ్ దేవరకొండ మూవీ ‘లైగర్’ని పూరితో కలిసి నిర్మిస్తున్న కరణ్ జోహార్, సౌత్ నుంచి వచ్చే సినిమాలతో పాటు హీరోహీరోయిన్స్‌ను కూడా సపోర్ట్ చేస్తున్నాడు. మరి ఇదే వరుసలో రష్మికకు కూడా అవకాశం ఇస్తున్నాడేమో తెలియాల్సి ఉంది.