Rashmika Mandanna: ఆనంద్.. నువ్వు నా ఫ్యామిలీరా.. హింట్ ఇస్తోందా.. క్లారిటీ ఇచ్చిందా?

Rashmika Mandanna: ఆనంద్.. నువ్వు నా ఫ్యామిలీరా.. హింట్ ఇస్తోందా.. క్లారిటీ ఇచ్చిందా?

బేబీ(Baby) సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda) ప్రస్తుతం గం గం గణేశా(Gam Gam Ganesha) తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కొత్త దర్శకుడు ఉదయ్ శెట్టి తెరకెక్కిస్తున్న ఈ క్రైం కామెడీ మూవీ మే 31న విడుదల కానుంది. ఇందులో భాగంగానే తాజాగా గం గం గణేశా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్ కి నేషనల్ క్రాష్ రష్మిక మందన్నా చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. అయితే ఈ సందర్బంగా విజయ్ దేవరకొండ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది రష్మిక. 

ఈవెంట్ లో భాగంగా రష్మికని సరదాగా చిలిపి ప్రశ్నలు అడిగాడు ఆనంద్ దేవరకొండ. రష్మిక తన సోషల్ మీడియాలో రీసెంట్ గా షేర్ చేసిన ఫోటోలను చూపిస్తూ వాటిపై ప్రశ్నలు అడిగాడు. ముందుగా రెండు పెట్స్(డాగ్స్) ను చూపించి వాటిలో తనకు ఏది ఎక్కువ ఇష్టం అని అడిగాడు. దానికి సమాధానంగా రష్మిక.. ఆరా(రష్మిక పెట్ డాగ్) నా ఫస్ట్ బేబీ, స్టార్మ్(విజయ్ పెట్ డాగ్) నా సెకండ్ బేబీ అని చెప్పుకొచ్చింది. 

ఆ తరువాత.. నీ ఫెవరేట్ కో స్టార్ ఎవరు అని అడిగాడు ఆనంద్.. దానికి మైక్ పక్కకు జరిపిన రష్మిక నీ యబ్బ అని.. ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీ రా.. నన్ను ఇలా స్పాట్ లో పెడతావా అని అంది. ఇక ఫైనల్ గా రౌడీ హీరో తన ఫెవరేట్ కో స్టార్ అని చెప్పించి రష్మిక. దాంతో.. అక్కడకు వచ్చిన విజయ్ ఫ్యాన్స్ అందరు ఒక్కసారిగా గట్టిగా అరిచారు. అయితే.. రష్మిక చేసిన కామెంట్స్ కొత్త చర్చకు దారి తీశాయి. అదేంటంటే.. రష్మిక ఆనంద్ ను నువ్వు నా ఫ్యామిలీరా.. అంది కాబట్టి ఆమె విజయ్ దేవరకొండతో రేలషన్ షిప్ లో ఉంది కాబట్టే అలా అందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అందుకే ఆ విషయంపై రష్మిక  హిట్ ఇస్తోందా.. క్లారిటీ ఇచ్చిందా? అనే కామెంట్స్ చేస్తున్నారు.