
వరుస విజయాలతో సౌత్‌తో పాటు నార్త్‌లోనూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిన రష్మిక మందాన్న.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెడుతోంది. ఈ యేడు నాలుగు సినిమాలతో రాబోతోంది. శర్వానంద్‌తో నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ఈ నెల 25న విడుదలవుతోంది. బాలీవుడ్ చిత్రాలు మిషన్ మజ్ను, గుడ్ బై ఈ సంవత్సరమే రిలీజ్ కానున్నాయి. ఇక ఇయర్ ఎండింగ్‌లో ‘పుష్ప 2’ వస్తుంది. ఓవైపు ఈ సినిమాలకు వర్క్ చేస్తూనే మరికొన్ని సినిమాలకు కూడా కమిటయ్యింది రష్మిక. వాటిలో రామ్ చరణ్ మూవీ ఒకటి. ప్రస్తుతం శంకర్ సినిమా షూట్‌లో పాల్గొంటున్న చరణ్.. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో నటించనున్నాడు. ఇందులో హీరోయిన్‌గా కొందరు బాలీవుడ్ బ్యూటీస్ పేర్లు వినిపించాయి. కానీ చివరికి ఆ చాన్స్ రష్మికకే దక్కినట్లు తెలిసింది. ఇదొక ఎమోషనల్ ఎంటర్‌టైనర్ అని, ఇందులో రష్మిక రోల్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందని అంటున్నారు. మరోవైపు బాలీవుడ్‌లోనూ బిజీ అయిపోయే ప్రయత్నాల్లో ఉంది. రీసెంట్‌గా కరణ్ జోహార్ ప్రొడక్షన్‌లో చాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా అదిరిపోయే అవకాశాల్ని అందిపుచ్చుకుంటోందంటే ఆమె డిమాండ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతోంది.