రాష్ట్రపతి నిలయంలో ‘కళాసంధ్య’

రాష్ట్రపతి నిలయంలో ‘కళాసంధ్య’

పద్మారావునగర్, వెలుగు: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆదివారం కళాసంధ్య కార్యక్రమం కనులపండువగా సాగింది. శ్రీరామ నృత్యాలయ డ్యాన్స్ అకాడమీకి చెందిన గురువు భార్వాది స్రవంతి రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు కూచిపూడి, భరతనాట్యం, ఫోక్ నృత్యాలు ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అకాడమీకి చెందిన 49 మంది కళాకారులు పలు విభాగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు.

ముఖ్య అతిథిగా రాష్ట్రపతి నిలయం ఇన్​చార్జి, మేనేజర్ రజనీ హాజరయ్యారు. ఆడబిడ్డలను సంస్కృతిలో భాగస్వాములుగా తీర్చిదిద్దాలని, వారికి ప్రాచీన కళారూపాలను నేర్పించడం ఎంతో అవసరమని అన్నారు. సీతాకల్యాణం ఘట్టం బాగుందన్నారు. ‘ఇదిగో భద్రాది’ పాటకు ఐదేళ్లలోపు చిన్నారులు చేసిన నృత్యంపై ఆనందం వ్యక్తం చేశారు.