రాజ్​పుత్​ కర్ణిసేన చీఫ్​ దారుణహత్య- ఇంట్లోనే కాల్చి చంపిన దుండగులు

రాజ్​పుత్​ కర్ణిసేన చీఫ్​ దారుణహత్య- ఇంట్లోనే కాల్చి చంపిన దుండగులు

రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. రాజస్థాన్​ జైపుర్​లోని శ్యామ్​నగర్​లో మంగళవారం (డిసెంబర్ 4న) మధ్యాహ్నం ఈ ఘటన జరగింది. ఈ కాల్పులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సుఖ్​దేవ్ సింగ్ ఉన్న ఇంట్లోకి నలుగురు దుండగులు ప్రవేశించి ఆయనపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన భద్రతా సిబ్బంది, మరొకరు గాయపడ్డారు. అలాగే తీవ్ర గాయాలైన సుఖ్​దేవ్ సింగ్​ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన చనిపోయారని జైపుర్ పోలీస్ కమిషనర్ బిజు జార్జ్ తెలిపారు. బైక్​పై దుండగులు సుఖ్​దేవ్ సింగ్ ఇంటికి వచ్చారని చెప్పారు.

సుఖ్‌దేవ్ ఇంటి వ‌ద్ద పోలీసులు భారీగా మోహ‌రించారు. కాల్పులు జ‌రిపిన వ్య‌క్తుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆయ‌న హ‌త్య‌కు అసలు కార‌ణాలు తెలియాల్సి ఉంది.