రాఘవేంద్ర రావు సినిమాలో హీరోయిన్గా రతికా.. కన్ఫర్మ్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ

రాఘవేంద్ర రావు సినిమాలో హీరోయిన్గా రతికా.. కన్ఫర్మ్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ

బిగ్ బాస్ బ్యూటీ రతికా రోజ్(Rathika rose) బంపర్ ఆఫర్ కొట్టేసింది. టాలీవుడ్ ప్రముఖ దర్శకులు కే రాఘవేంద్ర రావు(K Raghavendra rao) దర్శకత్వంలో రానున్న కొత్త సినిమాలో ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారట మేకర్స్. ఇదే విషయాన్ని స్వయంగా రతికా రోజ్ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది.  

నా కల నెరవేరింది. రాఘవేంద్ర రావు లాంటి గొప్ప దర్శకుడి సినిమాలో హీరోయిన్ గా అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. రాఘవేంద్ర రావు ఇంతకు ముందు నేను చేసిన సినిమాలు, ఫోటోలు చూసి ఆయన సినిమాలో పాత్రకు నేను సెట్ అవుతానని భావించి నాకు ఈ అవకాశం ఇచ్చారు. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక సినిమా విషయానికి వస్తే.. ఇదొక ఎమోషనల్ లవ్ స్టోరీ, అంతకన్నా ఎక్కువ సినిమా గురుంచి చెప్పలేను. ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది అంటూ చెప్పుకొచ్చారు రతికా.

ఈ పోస్ట్ చూసిన ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చివరికి నీ కష్టానికి తగిన ఫలితం దక్కింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఆమెకు ఎలాంటి బూస్టప్ ను ఇస్తుందో చూడాలి.