
బిగ్ బాస్ బ్యూటీ రతికా రోజ్(Rathka Rose) బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఏకంగా తమిళ స్టార్ విజయ్ తలపతి(Vijay Thalapathy) సినిమాలో లక్కీ ఛాన్స్ కోటేసిందట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ న్యూస్ తెలుసుకున్న నెటిజన్స్ రతికా నక్కతోక తొక్కింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. విజయ్ తలపతి ప్రస్తుతం దర్శకుడు వెంకట్ ప్రభుతో గోట్(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. విజయ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఈ సినిమా తరువాత మరో స్టార్ డైరెక్టర్ తో వర్క్ చేయనున్నాడట విజయ్. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్టుపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్ర కోసం రతికా రోజ్ ను సెలెక్ట్ చేశారట మేకర్స్. దీంతో.. ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.