బుల్లితెరపై తెలుగు బిగ్ బాస్ సీజన్-7(Bigg boss season7 ) సందడి మొదలైంది. ఈ సీజన్ లో లేడీ కంటెస్టెంట్ రతిక రోజ్(Rathika rose) పేరు బాగా వినిపిస్తోంది. హౌస్‌లోకి అడుగు పెట్టిన మొదటిరోజు నుంచే ఈ బ్యూటీ చాలా యాక్టివ్‌గా కనిపిస్తోంది. అందరితో సరదాగా మాట్లాడుతూ, పాటలు పాడుతూ ఆడియన్స్ కు బాగా దగ్గరైంది. ఇక పల్లవి ప్రశాంత్, రతికాతో సెపరేట్ ట్రాక్ నడిపిస్తున్నాడు బిగ్ బాస్.
Also Read :- గుండెపోటుతో మృతిచెందిన జైలర్ నటుడు
ఇదిలా ఉండగా.. తాజా ఎపిసోడ్ లో తాజాగా బిగ్ బాస్ రతికను ఎవరినైనా మిస్ అవుతున్నావా అని అడిగాడు. ఆ ప్రశ్నకు ఆమె ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంటూ.. అవును మిస్ అవుతున్నాను, చాలా ఏళ్ల నుంచి మిస్ అవుతున్నాను అంటూ సమాధానం ఇచ్చింది. దీంతో ఆమె తన మాజీ ప్రియుడిను చాలా మిస్ అవుతుందని, అతను మరెవరో కాదు బిగ్ బాస్ మూడో సీజన్ విన్నర్ రాహూల్ సిప్లిగంజ్ అర్థమైపోయింది.
ఇక రాహుల్ అండ్ రతికా కలిసి 2019లో ‘ హే పిల్లా’ అనే ప్రవైటు సాంగ్ చేశారు. ఆ సాంగ్ షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని, అలా కొంత కాలంపాటు చెట్టాపట్టాలేసుకోని తిరిగినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల రాహుల్ సిప్లీగంజ్‌కు రతికా రోజ్ బ్రేకప్ చెప్పిందట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.