అర్హులందరికీ రేషన్ కార్డులు : కలెక్టర్ అభిలాష అభినవ్

అర్హులందరికీ రేషన్ కార్డులు : కలెక్టర్ అభిలాష అభినవ్

లక్ష్మణచాంద(మామడ)/ఆదిలాబాద్ ​టౌన్/ఆసిఫాబాద్/ కుభీర్/కోల్​బెల్ట్, వెలుగు: రేషన్ కార్డుల ద్వారా ప్రభుత్వ పథకాలన్నీ మరింత మెరుగ్గా ప్రజలకు అందుతాయని నిర్మల్​ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం మామడ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డితో కలిసి లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చాలా ఏండ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులు లబ్ధిదారులకు చేరడం సంతోషకరమ న్నారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. కార్డులు రాని అర్హులు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. 

పేదలకు రేషన్ బియ్యం అందిస్తున్నందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కలెక్టర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేశారు. అడిషనల్​కలెక్టర్ కిశోర్ కుమార్, డీఎస్​వో రాజేందర్, ఆర్డీవో రత్నకల్యాణి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో సుశీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ ​జిల్లా జైనథ్, బేల, సాత్నాల, బోరజ్ మండలాల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్, అడిషనల్​ కలెక్టర్ శ్యామలా దేవి, గ్రంథాలయ చైర్మన్​నర్సయ్యతో కలిసి కలెక్టర్​ రాజర్షి షా లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు.

సుదీర్ఘకాలం తర్వాత రేషన్ కార్డులు

కెరమెరి మండల కేంద్రంలోని రైతు వేదికలో కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి ఎమ్మెల్సీ దండే విఠల్ లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ అర్హత గల ప్రతి లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సుదీర్ఘకాలం తర్వాత నిరుపేదలకు రేషన్ కార్డులు అందుతున్నాయని, అన్నారు. కుభీర్​లోని రైతు వేదికలో ఎమ్మెల్యే రామారావు పటేల్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. 

దేశంలో సన్న బియ్యం పంపిణీ చేసిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు. మండలంలోని ధార్​కుభీర్​లో రూ.29.22 లక్షలతో నిర్మించిన స్కూల్ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభిం చారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కల్యాణ్, భైంసా ఆత్మ చైర్మన్ వివేకానంద, అధికారులు, నేతలు పాల్గొన్నారు. మందమర్రి మండలం చిర్రకుంట ఎంపీడీవో రాజేశ్వర్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్​రాంచందర్, సీనియర్​ నేత ఒడ్నాల కోమురయ్య లబ్ధిదారులకు రేషన్ ​కార్డులు పంపిణీ చేశారు.