ఎన్నికల తర్వాత అర్హులకు రేషన్​కార్డులు : ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఎన్నికల తర్వాత అర్హులకు రేషన్​కార్డులు : ఉత్తమ్ కుమార్ రెడ్డి

హాలియా, వెలుగు: పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతవుతుందని రాష్ట్ర భారీ నీటిపారుల శాఖ, పౌరసరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్​కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండ జిల్లా హాలియాలో నాగార్జున సాగర్​ నియోజకవర్గ స్థాయి ఎన్నికల ప్రచార ప్రారంభ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు.

నెల్లికల్ లిఫ్టు నిర్మాణానికి రూ.200 కోట్ల మంజూరు చేయించి, రెండేండల్లో పనులు పూర్తి చేయించి 7వేల ఎకరాలకు సాగునీరందిస్తామని హామీ ఇచ్చారు. నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి రఘువీర్ రెడ్డికి దేశంలోనే భారీ మెజార్టీ రాబోతుందని జ్యోస్యం చెప్పారు. మాజీ సీఎల్పీ లీడర్ కుందూరు జానారెడ్డి మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో పాటు రూ. 4 వేల వృద్ధాప్య పెన్షన్ అమలు చేస్తామన్నారు.

ఎంపీ అభ్యర్థి రఘువీర్​రెడ్డి, నాగార్జునసాగర్, దేవరకొండ, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే కుందూరు జై వీర్ రెడ్డి, నేనావత్ బాలు నాయక్, బత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, పీసీసీ కార్యదర్శి పున్న కైలాస్ నేత, కర్నాటి లింగారెడ్డి, తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, కాకునూరి నారాయణ గౌడ్, మలిగిరెడ్డి లింగారెడ్డి, కుందూరు వెంకటరెడ్డి, చింతల చంద్రారెడ్డి, వెంపటి శ్రీనివాస్ పాల్గొన్నారు.