ఇయ్యాల్టి నుంచే రేషన్ పంపిణీ

ఇయ్యాల్టి నుంచే రేషన్ పంపిణీ

కూపన్ల ద్వారా పంపిణీ.. వాటిపై టైమ్ స్లాట్ సైతం
రేషన్‌‌‌‌షాపుల వద్ద శానిటైజర్లు, సబ్బులు
కేంద్ర కోటాపై స్పష్టతనివ్వని ప్రభుత్వం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన బియ్యం పంపిణీ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. కరోనా నేపథ్యంలో బయోమెట్రిక్‌‌‌‌ద్వారా రేషన్ ఇస్తే వైరస్‌ వ్యాప్తిచెందే అవకాశం ఉందనే కారణంతో కూపన్లద్వారా పంపిణీ చేపట్టాలని సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ నిర్ణయించింది. ఎక్కువ మంది గుమిగూడకుండా కూపన్ల పై టైమ్‌‌‌‌ కేటాయించి, ఆ సమయంలోనే వారికి రేషన్
ఇవ్వనున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో పేద ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రతి లబ్దిదారుడికి 12 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 17,018 రేషన్‌‌‌‌షాపుల్లో 87.56 లక్షల కార్డులు ఉండగా 2.83 కోట్లమంది లబ్దిదారులు ఉన్నారు. తెల్ల రేషన్‌‌‌‌ కార్డు కలిగిన కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ 12 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా అందించేందుకు
3.39 లక్షల టన్నుల బియ్యం అవసరమవుతాయని, ఇందుకు రూ.1,103 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.

వారికి మాత్రం బయోమెట్రిక్ ద్వారానే…
వాస్తవానికి గత గురువారం నుంచే రేషన్ పంపిణీ చేపట్టి రెండ్రోజులు కేవలం 2.34 లక్షల కార్డులకు మాత్రమే పంపిణీ చేసి నిలిపివేశారు. బయోమెట్రిక్‌‌‌‌ ద్వారా రేషన్ ఇస్తే కరోనా వ్యాప్తిచెందే అవకాశం ఉందనే కారణంతో కూపన్ల ద్వారా పంపిణీ చేయాలని నిరయ్ణించారు. మళ్లీ బుధవారం నుంచి పంపిణీ ప్రారంభించనున్నారు. ఇప్పటికే కూపన్లను ముద్రించి రేషన్‌‌‌‌షాపులకు పంపించారు. ప్రతి నెల రేషన్‌‌‌‌ తీసుకునే వారికే కూపన్లు అందించనున్నారు. మూడు నెలలుగా రేషన్‌‌‌‌ తీసుకోని వారికి మాత్రం ఈ–పాస్‌ మెషిన్ల ద్వారానే పంపి ణీ చేయనున్నారు. రేషన్‌‌‌‌షాపుల వద్ద ఎక్కువ మంది గుమిగూడకుండా ఉండేందుకు కూపన్ల పై టైమ్‌‌‌‌స్లాట్‌‌‌‌ ముద్రించారు. వారికి కేటాయించిన సమయంలోనే వచ్చిరేషన్‌‌‌‌ తీసు
కోవాలని సూచించారు. షాపుల దగ్గర 3 ఫీట్ల సోషల్‌‌‌‌ డిస్టెన్స్‌‌‌‌ పాటించాలని, దీనిపై కఠినంగా వ్యవహరించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అదే విధంగా రేషన్‌‌‌‌షాపుల వద్ద శానిటైజర్లు, సబ్బులు ఏర్పాటు చేయాలని సూచించారు. రోజు వారీగా సాయంత్రం 5గంటల వరకు డెయిలీ రిపోర్ అందించాలని సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌ అధికారులకు ఆదేశాలిచ్చారు.

వలస కార్మికులకు రేషన్ షురూ
రాష్ట్రంలో పని చేస్తున్న వలస కార్మికులకు అధికారులు రేషన్‌‌‌‌ పంపిణీ చేపట్టారు. ఆధార్‌‌‌‌ నెంబర్ ఆధారంగా కార్మికులను గుర్తించిన రెవెన్యూ అధికారులు మంగళవారం రేషన్‌‌‌‌ బియ్యం అందించారు. 12కిలోల బియ్యంతో పాటు ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికీ రూ.500 చొప్పున నగదు
అందజేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇటుక బట్టిల్లో పని చేసే కార్మికులు, భవన నిర్మాణ రంగంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు, నేషనల్‌‌‌‌ హైవే వద్ద గుర్తించిన కార్మికులకు రేషన్‌‌‌‌ పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లోని బస్తీల్లో కమ్యూనిటీ హాళ్లలో వలస కార్మికులకు షెల్టర్‌‌‌‌ ఏర్పాటు చేశారు. సివిల్‌‌‌‌ సప్లయ్స్‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌ స్టాక్‌‌‌‌ పాయింట్‌ నుంచి రేషన్‌‌‌‌ బియ్యం తెప్పించి డీలర్ల సాయంతో అందరికీ 12కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.35లక్షల మంది వలస కార్మికులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీరందరికీ రేషన్‌‌‌‌, ప్రతి ఒక్కరికీ రూ.500 అందజేస్తామని ఇప్పటికే ప్రకటించింది.

కేంద్ర కోటాపై తేల్చలే…
ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు చొప్పున మూడు నెలల పాటు ఉచితంగా అందజేస్తామని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది.
అయితే దానిపై సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. కేంద్రమిచ్చే 5 కిలోల బియ్యం కోటాను రాష్ట్రమిచ్చే 12 కిలోల్లో మినహాయించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు కందిపప్పు కోటా బాధ్యతను కేంద్రం నాఫెడ్‌‌‌‌కు అప్పగించింది. నాఫెడ్‌‌‌‌ద్వారా కందిపప్పు సేకరించి లబ్ది దారులకు అందజేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర అధికారులు నాఫెడ్‌‌‌‌కు ఇండెంట్‌‌‌‌ పంపారు. మరో 15 రోజుల్లో కందిపప్పు వచ్చే అవకాశం ఉందని సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌ అధికారులు తెలిపారు. ఇప్పడైతే రాష్ట్రం ప్రకటించిన 12 కిలోల బియ్యమే ఇస్తున్నామని, మిగతావేవి తమకు తెలియదని చెబుతున్నారు.

రాష్ట్రంలో రేషన్ కార్డుల లెక్క ఇదీ…
మొత్తం కార్డులు 87.59 లక్షలు, లబ్ది దారులు 2. 83 కోట్లు

కేంద్ర పరిధిలో…
కార్డులు 53.29 లక్షలు, లబ్ది దారులు 1.91 కోట్లు

రాష్ట్ర పరిధిలో…
కార్డులు 34.25 లక్షలు, లబ్ది దారులు 87.55 లక్షల

For More News..

లాక్డౌన్ పొడిగించే ఆలోచన లేదు