రామ్ లీలాలో అట్టహాసంగా రావణ దహనం

రామ్ లీలాలో అట్టహాసంగా రావణ దహనం

ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో అట్టహాసంగా రావణ దహనం కార్యక్రమం జరిగింది.  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య అతిథిగా హాజరై రావణ దహన  కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలకు ఆయన దసరా, దీపావళి, నవరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. అందరు సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. ఇక రావణ దహన ఘట్టాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తజనం తరలివచ్చారు. రామ్ లీలా మైదానంలో కళాకారులు ప్రదర్శించిన రామాయణ ఘట్టాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.

170 ఏళ్ల కింద మొగల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ ఈ వేడుకలను ప్రారంభించారని చరిత్రకారులు చెబుతుంటారు. నవరాత్రుల్లో భాగంగా రాంలీలా మైదానంలో ప్రత్యేక మేళా నిర్వహిస్తారు. ఖత్రీ కమ్యూనిటీకి చెందిన వారు యేటా ఈ రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. రామ్ లీలా మైదానంలో జరిగే వేడుకల్లో విదేశీ టూరిస్టులు, ప్రతినిధులు కూడా పాల్గొంటారు.