తొలి రోజు బాక్సాఫీస్ దగ్గర ‘రావణాసుర’ పరిస్థితి ఇది..

తొలి రోజు బాక్సాఫీస్ దగ్గర ‘రావణాసుర’ పరిస్థితి ఇది..

మాస్ మహారాజా రవితేజ(Raviteja) నటించిన రావణాసుర(Ravanasura) థియేటర్లలో సందడి చేస్తోంది. ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. కెరీర్ లోనే ఇప్పటి వరకూ చేయని ఓ కొత్త క్యారెక్టర్ ను రవితేజ ఎంచుకున్నాడు. ఎప్పటిలాగే సినిమాను తన భుజాలపై వేసుకుని నడిపించాడు. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లు ఇలా ఉన్నాయి. 

బాక్సాఫీస్ దగ్గర రావణాసుర భారీ ఓపెనింగ్ నే దక్కించుకున్నాడు. కానీ, ఇటీవల వచ్చిన ధమాకా సినిమా తొలి రోజు వసూళ్లతో పోలిస్తే ఇది చాలా తక్కువే. ఏపీ, నైజాంతో కలిపి ఇండియా వైడ్ గా ఈ సినిమా రూ. 6 కోట్లకు పైగానే వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తేన్నాయి. 

రవితేజ గత సినిమాలు కిలాడీ రూ.6.8, రామారావు ఆన్ డ్యూటీ రూ. 6.3, ధమాకా రూ. 9.48 కోట్ల మేర వసూళ్లను సాధించాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ను రూ.25 కోట్ల మేర లెక్కగట్టారు. ప్రస్తుతం నాని దసరా రెండో వారంలోకి అడుగుపెట్టింది. కిరణ్ అబ్బవరం మీటర్ సైతం ప్రభావం చూపలేకపోయింది.

ఈ సినిమాలు మినహా రావణాసురకు పెద్దగా పోటీ కూడా లేదు. ఈ వీకెండ్ వసూళ్లు పుంజుకునే అవకాశం లేకపోలేదు. ఈ యాక్షన్ థ్రిల్లర్ కు సుధీర్ వర్మ దర్శకత్వం వహించగా అభిషేక్ నామా నిర్మించాడు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజితా పొన్నాడ హీరోయిన్లుగా నటించారు. సుశాంత్ మరో కీలక పాత్రలో నటించాడు.