‘రావణాసుర’ గెలిచాడా.. ఓడాడా.. ఫుల్ మూవీ రివ్యూ

‘రావణాసుర’ గెలిచాడా.. ఓడాడా..   ఫుల్ మూవీ రివ్యూ

రవితేజ హీరోగా నటిస్తూ నిర్మించిన లేటెస్ట్ మూవీ ‘రావణాసుర’. అను ఇమాన్యూయల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్ధుల్లా, దక్షా నగార్కర్ ఫీమేల్ లీడ్ గా నటించిన ఈ మూవీని... సుధీర్ వర్మ డైరెక్ట్ చేశారు. ఇక రిలీజ్ కి ముందే సాంగ్స్, టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఇది ప్రేక్షకుల అంచనాలని అందుకుందా లేదా చూద్దాం.

సినిమా కథ ఏంటంటే..?
మెడికల్ మాఫియా బ్యాగ్రౌండ్ లో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. అలాంటి మెడికల్ అండ్ ఫార్మా రిలేటెడ్ మూవీనే ఈ రావణాసుర. అయితే ఇది తెలిసుకునేలోపే మనకు తలనొప్పి స్టార్ట్ అయిపోతుంది. ఒక మెడికల్ ఆఫీసర్ మర్డర్ తో స్టార్ట్ అయిన ఈ మూవీ... వెంటనే కామెడీ ట్రాక్ లోకి వెళ్లిపోతోంది. ఒకవైపు కామెడీ ట్రాక్ నడుస్తూనే... మరోవైపు కొంతమంది హత్యలకు గురౌతుంటారు. అందులో మంచి ఫోలీస్ ఆఫీసర్ గా పేరుతెచ్చుకున్నా సిటీ కమీషనర్ కూడా ఒకడు. అయితే వాళ్లని హత్య చేసింది ఎవరు? ఎందుకు చేయాల్సి వస్తుందనేదే ఈ సినిమా స్టోరీ.

రవితేజ వన్ మ్యాన్ షో..
ఈ సినిమాలో జూనియర్ క్రిమినల్ లాయర్ రవీంద్రగా రవితేజ జీవించేశాడు. తనదైన స్టైల్ లో కామెడీ, యాక్షన్ సీన్స్, ఫైట్స్, డ్యాన్సుల్లో ఇరగదీశాడు. ఇక సెకండాఫ్ మిడిల్ వరకు రవితేజ క్యారెక్టర్ హీరోనా లేకా విలనా అనేది కూడా ప్రేక్షకుని ఊహకందదు. అయితే సినిమా మొత్తం రొటీన్ థ్రిల్లర్ లాగా ఉన్నా... ఈ ఒక్క సస్పెన్సే కుర్చీ నుంచి లేవనీయదు. ఇక క్రిమినల్ లాయర్ గా ఫరియా అబ్ధుల్లా, బిజినెస్ మ్యాన్ కూతురిగా మేఘా ఆకాశ్ లు తమ పాత్రలకు న్యాయం చేశారు. దక్ష నగార్కర్, అను ఇమాన్యూయల్ ల పాత్రలు చిన్నావే. అను ఇమాన్యూయల్ ని కేవలం రొమాన్స్ కే పరిమితం చేశాడు డైరెక్టర్. 

ఎవరెలా చేశారంటే..?
పోలీస్ ఆఫీసర్ గా జయరామ్, ఆర్టిస్ట్ గా సుశాంత్ లు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక రావు రమేష్ నటన గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏ పాత్రలో అయిన ఒదిగిపోయే తత్వం అయనది. ఎలాంటి స్లాంగ్ లో అయిన తన వాక్చాతుర్యంతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంటాడు. అయితే ఈ సినిమాలో విలన్ గా నటించిన ఆయన మాట్లాడే తెలంగాణ లాంగ్వేజ్ థియేటర్ లో కూర్చుకున్న ప్రతి ఒక్కళ్లకి ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఆ పాత్రని డైరెక్టర్ కావాలని అలా డిజైన్ చేశాడా? లేక తెలంగాణ రావు రమేష్ తెలంగాణ స్లాంగ్ సరిగ్గా మాట్లాడలేకపోయాడా అన్నది పక్కన పెడ్తే... ఈ సినిమాలో కథ ఎంత రొటీన్ గా ఉందో... ఈ క్యారెక్టర్ అంతే మైనస్ గా అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం గురించి..
విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ, హర్షవర్థన్ రామేశ్వర్ మ్యూజిక్ బాగున్నాయి. భారీ ఎక్స్ పెక్టేషన్స్  పెట్టకుని ఈ సినిమాకి వెళ్తే మత్రం నిరాశే ఎదురవుతుంది. ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా... రవితేజ కామెడీ, యాక్షన్ ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్లు మాత్రం థియేటర్ కి వెళ్లొచ్చు. ఈ సినిమా గురించి ఒక్కమాటలో చెప్పాలాంటే... ఇదో రొటీన్ థ్రిల్లర్ మూవీ.