అమ్ముమ్మ అయిన KGF 2 ప్రధానమంత్రి

అమ్ముమ్మ అయిన KGF 2 ప్రధానమంత్రి

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్(Raveena Tandon) అమ్మమ్మ అయ్యారు. ఈ విషయాన్ని ఆమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్బంగా ఆమె తన మనవడు రుద్ర(Rudra)తో ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఎంతో క్యూట్ గా ఈ ఫొటోకు ఆమె ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక రవీనా టాండన్ పిల్లల విషయానికి వస్తే.. ఆమే  పెళ్ళికి ముందే పూజ, ఛాయా అనే ఇద్దరమ్మాయిలు దత్తతతీసుకున్నారు. ఆ తరువాత కొంతకాలానికి సినిమా డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక అమ్మాయి, అబ్బాయి పుట్టారు. ఇక రవీనా టాండన్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. సంజయ్ దత్, పార్థ్ సమతాన్ మరియు ఖుషాలి కుమార్‌ కాంబోలో వస్తున్న రొమాంటిక్-కామెడీ చిత్రం ఘుడచాడిలో నటిస్తున్నారు.