అక్షయ్ తో బ్రేకప్.. 25 ఏళ్ల తర్వాత నోరు విప్పిన నటి

అక్షయ్ తో బ్రేకప్.. 25 ఏళ్ల తర్వాత నోరు విప్పిన నటి

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, నటి రవీనా టాండన్ 1990ల్లో మంచి హిట్ ఫెయిర్. 1994లో వచ్చి మెహ్రా సినిమా హిట్ కావడంతో  వీళ్ల జోడీకి క్రేజ్ పెరిగింది. వీళ్లిద్దరు కలిసి నటించిన చాలా సినిమాలు హిట్ అయ్యాయి.  తర్వాతే వీళ్లిద్దరు రిలేషన్ షిప్ లో ఉండటం, ఎంగేజ్ మెంట్ కావడం, ఆ  తర్వాత బ్రేకప్ జరిగిపోవడం అన్నీ వెంటవెంటనే జరిగిపోయాయి. 2001లో అక్షయ్ కుమార్, ట్వింకిల్ కన్నాను, 2004 లో రవీనా టాండన్ అనిల్ తడాని పెళ్లి చేసుకుని  ఎవరి జీవితాన్ని వాళ్లు గడుపుతున్నారు. అక్షయ్ కుమార్ కు ఒక కూతురు, కొడుకు ఉన్నారు.

అయితే మళ్లీ దాదాపు 25 ఏళ్లకు అక్షయ్ తో బ్రేకప్ గురించి రవీనా టాండన్ స్పందించడం చర్చనీయాంశంగా మారింది.  ‘అక్షయ్ తో తనకు ఎంగేజ్ మెంట్ జరిగిందనేది నిజం కానీ ఎప్పుడు జరిగిందనేది గుర్తుకు లేదు. ఎవరి జీవితాలు వాళ్లు జీవిస్తూ ముందుకు సాగుతున్నాం. ఇప్పటికీ  అప్పుడప్పుడు కలుసుకుంటాం. అయితే అక్షయ్‌ తో పెళ్లి క్యాన్సిల్‌ అయిన తర్వాతి పరిణామాలను ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నాను. అవి నా మనసులోనే ఉన్నాయి. వాటిని ఎందుకు మర్చిపోలేకపోతున్నానో తెలియడం లేదు అని రవీనా చెప్పుకొచ్చింది.