
నాలుగో టెస్ట్‌లో ఆరు వికెట్లతో చెలరేగిన రవి అశ్విన్ పలు రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. సొంతగడ్డపై టెస్ట్‌ల్లో అత్యధికసార్లు ఐదు వికెట్లు (26) తీసిన తొలి బౌలర్‌గా అతను రికార్డులకెక్కాడు. గతంలో అనిల్ కుంబ్లే (25) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. ఓవరాల్ టెస్ట్ కెరీర్‌లో అశ్విన్ 32సార్లు ఐదు వికెట్ల హాల్‌ను సాధించాడు. తద్వారా అండర్సన్‌తో సమంగా నిలిచాడు. ఇక స్వదేశంలో అత్యధిక ఐదు వికెట్ల హాల్ సాధించిన రికార్డు మురళీధరన్ (45) పేరుమీద ఉంది. కుంబ్లే సాధించిన 500 వికెట్ల ఘనతకు అశ్విన్ 27 వికెట్ల దూరంలో ఉన్నాడు. ఆసీస్‌పై టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన తొలి ఇండియన్ బౌలర్‌గానూ అశ్విన్ (113) రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో కుంబ్లే (111) రికార్డును బ్రేక్ చేశాడు. బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన నేథన్ లైయన్ (113)తో అశ్విన్సమంగా ఉన్నాడు. మరోవైపు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 300 క్యాచ్‌లు పట్టిన రెండో ఇండియన్ ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ (334) ఈ లిస్ట్‌లో ముందున్నాడు. కేవలం టెస్ట్‌ల్లో అయితే కోహ్లీ.. గావస్కర్ (108)ను దాటేశాడు. ద్రవిడ్ (210) టాప్‌లో ఉన్నాడు.