
సైబరాబాద్: టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాష్ ఫోర్జరీ చేసినట్లు తమ వద్ద టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నాయని సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్ అన్నారు. అలంద మీడియా ఇచ్చిన కేస్ పైన అన్ని కోణాల్లో రవి ప్రకాష్ ను ప్రశ్నించామని ఆయన అన్నారు.
రవి ప్రకాష్ ను విచారించిన మూడు రోజులు మూడు నోటీసులు ఇచ్చామని, మూడు రోజులుగా విచారించినా అతను ఎటువంటి సమాధానాలు చెప్పలేదన్నారు. విచారణకు ముందు 41 CRPC కింద నోటీస్ ఇచ్చే రవిని విచారించామని అన్నారు.రవి ప్రకాష్ విచారణకు వచ్చినప్పుడు బయట ఒకలా..లోపల ఒకలా వ్యవహరిస్తున్నాడని ఏసీపీ అన్నారు.
తమ వద్ద ఉన్న ఎవిడెన్స్, రవి ప్రకాష్ చెప్పిన సమాధానాలు రెండింటిని రేపు కోర్టుకు సమర్పిస్తామని అన్నారు. కోర్టు ఇచ్చే ఇత్తర్వులను బట్టి రవిప్రకాష్ ను అరెస్ట్ చేయాలనా..లేదా అన్నది తెలుస్తుందని ఏసీపీ శ్రీనివాస్ అన్నారు.