IPL 2024: అలాగైతే కోహ్లీ అందరి కంటే ఎక్కువ ట్రోఫీలు గెలిచేవాడు: రవిశాస్త్రి

IPL 2024: అలాగైతే కోహ్లీ అందరి కంటే ఎక్కువ ట్రోఫీలు గెలిచేవాడు: రవిశాస్త్రి

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రపంచ క్రికెట్ లో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. ఫార్మాట్ ఏదైనా 15 సంవత్సరాలుగా నిలకడగా ఆడుతూ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. భారత క్రికెట్ లో దాదాపు సగం రికార్డులను తన పేరిట లిఖించుకున్న కోహ్లీ వ్యక్తిగతంగా సాధించలేనిదంటూ ఏది లేదనిపిస్తుంది. సోషల్ మీడియాలో కోహ్లీకి తిరుగు లేదు. క్రికెట్ లో అత్యధిక ఇంస్టాగ్రామ్ ఫాలోవర్లను కలిగి ఉన్న ఏకైక వ్యక్తిగా టాప్ లో ఉన్నాడు. ఎన్ని సాధించినా కోహ్లీ కెప్టెన్ గా పగ్గాలు చేపట్టిన తర్వాత ఒక్క ట్రోఫీ కూడా తన ఖాతాలో లేదు. 

చివరిసారిగా టీమిండియా 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో కోహ్లీ సభ్యుడు. ఈ పదేళ్లలో కోహ్లీ ఒక్క అన్ని ఫార్మాట్ లలో అదరగొడుతున్న టీమిండియాతో పాటు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ కు టైటిల్ అందించలేకపోతున్నాడు. టీమిండియా టైటిల్ ముద్ధాడిన 17 ఏళ్లుగా ఐపీఎల్ టైటిల్ ఊరిస్తూనే ఉంది. ఈ విషయమే కోహ్లీతో పాటు ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరుస్తుంది. ఒక్కడే వారియర్ లా పోరాడుతున్నా అతన్ని దురదృష్టం వెంటాడుతుంది. ఈ దశలో కోహ్లీకి మద్దతుగా ప్రముఖ కామెంటేటర్ రవిశాస్త్రి నిలిచాడు. విరాట్ పై ప్రశంసలు కురిపించాడు. 

భారత మాజీ కోచ్ రవిశాస్త్రి కోహ్లికి అత్యంత సన్నిహితులలో ఒకరని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ లో కోహ్లీకి ఒక్క టైటిల్ కూడా లేదని అడిగిన ప్రశ్నకు రవిశాస్త్రి అదిరిపోయే సమాధానం చెప్పాడు. ఐపీఎల్ అనేది వ్యక్తిగత ఆట అయితే కోహ్లీ అందరికంటే ఎక్కువ ట్రోఫీలు గెలుచుకునే వాడని శాస్త్రి అన్నాడు. ఇప్పటివరకు కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున 16 సీజన్ లు ఆడాడు. ప్రస్తుతం 17 వ సీజన్ ఆడుతున్నాడు. ఇప్పటివరకు ఆర్సీబీ జట్టుకు టైటిల్ గెలవలేదు. రికార్డ్స్ పరంగా అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు కోహ్లీ పేరిట ఉన్నాయి.