రవితేజ, శ్రీలీల జంటగా నటించిన రీసెంట్ మూవీ ‘మాస్ జాతర’. ఈ మాస్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ దగ్గర మిక్సెడ్ టాక్తో తెచ్చుకుంది. ఈ క్రమంలో మేకర్స్ ఆశించనంత స్థాయి వసూళ్లు సాధించలేకపోయింది. దీంతో మూవీ నెల రోజుల లోపే ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. అక్టోబర్ 31న థియేటర్లలోకి వచ్చిన మాస్ జాతర.. నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్కి సిద్ధమైంది. లేటెస్ట్గా ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.
టీజర్, ట్రైలర్, సాంగ్స్తో మెప్పించిన ఈ మూవీ కంప్లీట్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఎంటర్‌టైన్ చేసేలా ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ, దర్శకుడు భాను భోగవరపు కథ-కథనంపై కాకుండా, కేవలం రవితేజ ఫ్యాన్స్‌ని సంతృప్తి పరిచే మాస్ ఎలివేషన్స్, యాక్షన్ అంశాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారనే టాక్ తెచ్చుకుంది.
రైల్వే పోలీసు అధికారిగా లక్షణ్ భేరీ పాత్రలో ఒదిగిపోయారు. యాక్షన్ సీన్లు అదరగొట్టేశారని ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. కానీ, పాత సినిమాల్లోని సంఘర్షణే.. కథలో చూపించడంతో ఫ్యాన్స్ కూడా పూర్తిగా డిస్సప్పాయింట్ అయ్యారు. ఇకపోతే.. 'ధమాకా'తో హిట్ కొట్టిన రవితేజ, శ్రీలీల.. మాస్ జాతరతో ఆడియన్స్ కు మాస్ విందు వడ్డించలేకపోయారు. మరి ఓటీటీలో ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.
Ee massodu mee intiki jathara ni theeskosthunnadu! 🔥 pic.twitter.com/Fhc3TpTqL3
— Netflix India South (@Netflix_INSouth) November 25, 2025
కథేంటంటే:
లక్ష్మణ్ భేరి (రవితేజ) ఒక పవర్‌ఫుల్ రైల్వే పోలీసు అధికారి. తన పరిధి కాకపోయినా అన్యాయం జరిగితే సహించలేని మనస్తత్వం అతనిది. ఈ క్రమంలోనే వరంగల్‌లో ఓ కేసులో మంత్రి కొడుకుని కొడతాడు. దీంతో అక్కడి నుంచి అల్లూరి జిల్లాలోని అడవివరం అనే మారుమూల ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్ అవుతాడు. అయితే ఆ ప్రాంతం మొత్తం శివుడు (నవీన్ చంద్ర) అనే గంజాయి స్మగ్లర్ కంట్రోల్‌లో ఉంటుంది. జిల్లా ఎస్పీ నుంచి రాజకీయనాయకుల అండదండలు ఉన్న శివుడికి ఉంటాయి. మరి ఆ శివుడు సామ్రాజ్యాన్ని, కేవలం రైల్వే ఎస్సై అయిన లక్ష్మణ్ భేరి ఎలా అడ్డుకున్నాడు? తులసి (శ్రీలీల) పాత్ర ఈ కథలో ఎలా కీలకంగా మారింది? అన్నదే మిగతా కథ.
