
తమకు సక్సెస్ ఇచ్చిన దర్శకులను రిపీట్ చేయడంలో స్టార్ హీరోలు ముందుంటారు. వారిలో రవితేజ కూడా ఉంటాడు. డాన్ శీను, బలుపు, క్రాక్ లాంటి హ్యాట్రిక్స్ హిట్స్ ఇచ్చిన గోపీచంద్ మలినేనితో నాలుగో సినిమా చేయబోతున్నాడు రవితేజ. దీనికి సంబంధించిన అఫిషీయల్ అనౌన్స్‌మెంట్ ఆదివారం వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలియజేశారు.
రవితేజ కోసం గోపీచంద్ యూనిక్ పవర్‌ఫుల్ స్టోరీని సిద్ధం చేశాడట. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో భయానక స్థితిలో ఉన్న ఓ గ్రామం, కాలిపోతున్న ఇల్లు, డేంజర్ బోర్డు, దేవాలయం కనిపిస్తున్నాయి. టెర్రిఫిక్‌గా ఉన్న ఈ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. తమన్ సంగీతం అందించనున్నట్టు చెప్పిన దర్శక నిర్మాతలు.. మిగిలిన టెక్నీషియన్స్, నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
మరోవైపు టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు రవితేజ. వీటిని పూర్తిచేయగానే ఈ మూవీ సెట్‌లో జాయిన్ కానున్నట్టు తెలుస్తోంది.