Raviteja : క్లాస్ డైరెక్టర్ తో మాస్ మహారాజ్ నెస్ట్ మూవీ

Raviteja : క్లాస్ డైరెక్టర్ తో మాస్ మహారాజ్ నెస్ట్ మూవీ

బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో  స్పీడ్‌‌‌‌గా సినిమాలు చేసే హీరోల్లో రవితేజ ముందు వరుసలో ఉంటాడు. ఏడాదికి కనీసం రెండు చిత్రాలతోనైనా ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటాడు.  ప్రస్తుతం భాను భోగవరపు డైరెక్షన్‌‌‌‌లో ‘మాస్ జాతర’ మూవీ చేస్తున్నాడు.  ఇది రవితేజ నటిస్తున్న 75వ సినిమా. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న  ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సమ్మర్‌‌‌‌‌‌‌‌లో రిలీజ్‌‌‌‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే   తాజాగా రవితేజ  మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. 

కిశోర్ తిరుమల డైరెక్షన్‌‌‌‌లో నెక్స్ట్ ప్రాజెక్టు ఉండనుందని తెలుస్తోంది. నేను శైలజ, చిత్రలహరి, ఉన్నది ఒకటే జిందగీ లాంటి సినిమాలు తీసిన కిశోర్ తిరుమల.. రవితేజ కోసం ఓ ఫీల్ గుడ్ స్టోరీని రెడీ చేశాడట.  రీసెంట్‌‌‌‌గా తను  చెప్పిన కథకు రవితేజ ఇంప్రెస్ అయ్యాడని, వెంటనే ఈ చిత్రానికి ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. స్క్రిప్ట్ వ‌‌‌‌ర్క్ కూడా పూర్తవడంతో  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. మాస్ చిత్రాలతో ఆకట్టుకునే రవితేజ.. ఇప్పుడు క్లాస్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌తో సినిమా అంటేనే అంచనాలు ఏర్పడతాయి.  ఈ కాంబినేషన్‌‌‌‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.