ఈగల్ ఆన్ ద వే

ఈగల్ ఆన్ ద వే

రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’.  శుక్రవారం రవితేజ పుట్టిన రోజు, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ మూవీ నుంచి టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌ సాంగ్‌‌‌‌ను రిలీజ్ చేశారు. దావ్‌జాంద్  స్కోర్ చేసిన పాటలో రవితేజ స్టైలిష్ లుక్‌‌‌‌లో ఇంప్రెస్ చేస్తున్నారు. ఆయన పోషించిన సహదేవ్ అకా ఈగల్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ను తెలియజేసేలా పాట సాగింది. 

‘ఈగల్స్ ఆన్ హిస్ వే’ అంటూ ఎలక్ట్రిఫైయింగ్ ట్రాక్‌‌‌‌లో ఇంగ్లీష్  లిరిక్స్ రాసిన జార్జినా మాథ్యూ.. తనే  స్వయంగా పాటను పాడాడు. ఈ సినిమాలో రవితేజ మల్టిపుల్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు.  కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్‌‌‌‌గా నటించిన ఈ చిత్రంలో నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, ప్రణీత పట్నాయక్, అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి ఇతర పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల కో ప్రొడ్యూసర్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరిస్తున్నారు.  ఫిబ్రవరి 9న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో  సినిమా విడుదల కానుంది.