‘టైగర్ నాగేశ్వరరావు’ పై రవితేజ ఫోకస్

‘టైగర్ నాగేశ్వరరావు’ పై రవితేజ ఫోకస్

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు రవితేజ. ఇప్పటికే ‘రావణాసుర’ షూటింగ్ పూర్తిచేసి ఏప్రిల్‌‌లో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మరోవైపు ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీపైనా ఫోకస్ పెట్టాడు రవితేజ. వంశీకృష్ణ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టూవర్టుపురం గజదొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. రీసెంట్‌‌గా లాస్ట్ షెడ్యూల్ షూటింగ్‌‌ను విశాఖపట్నంలో ప్రారంభించారు. దీనికోసం భారీ బడ్జెట్‌‌తో  ఐదు ఎకరాల స్థలంలో స్టూవర్టుపురం సెట్‌‌ వేశారు. ఈ షెడ్యూల్‌‌లో కోర్ టీమ్‌‌పై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. 1970 బ్యాక్‌‌డ్రాప్‌‌లో జరిగే స్టోరీ కావడంతో రవితేజ కంప్లీట్ మేకోవర్ అయ్యాడు. ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా సరికొత్త బాడీ లాంగ్వేజ్‌‌, యాసతో అలరించనున్నట్టు టీమ్ చెబుతోంది.  నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రేణుదేశాయ్‌‌, అనుపమ్ ఖేర్‌‌‌‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.