రామారావు ఆన్ డ్యూటీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్

రామారావు ఆన్ డ్యూటీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్

బ్యాక్‌‌‌‌‌‌‌‌ టు బ్యాక్ సినిమాలతో ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్ చేస్తున్న రవితేజ.. ఈ ఇయర్ ఇప్పటికే ‘ఖిలాడి’గా వచ్చాడు. ఆ తర్వాత ‘రామారావు ఆన్‌‌‌‌‌‌‌‌ డ్యూటీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే అనుకోని కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. నిన్న కొత్త రిలీజ్ డేట్‌‌‌‌‌‌‌‌ని అనౌన్స్ చేశారు. జులై 29న థియేటర్స్‌‌‌‌‌‌‌‌లో పలకరించనున్నట్టు కన్‌‌‌‌‌‌‌‌ఫర్మ్ చేశారు. శరత్ మండవ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. దివ్యాంశ కౌశిక్, రాజీషా విజయన్ హీరోయిన్స్​. వేణు తొట్టెంపూడి కీలక పాత్ర పోషిస్తున్నాడు. నాజర్, నరేష్, పవిత్రా లోకేష్, జాన్ విజయ్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. డిప్యూటీ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రవితేజ క్యారెక్టర్ ఎంత పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్యాక్డ్‌‌‌‌‌‌‌‌గా ఉండబోతోందో ఇప్పటికే టీజర్, పోస్టర్స్‌‌‌‌‌‌‌‌ ద్వారా చూపించారు. ఇప్పుడీ ప్రకటనతో పాటు కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వదిలారు. మెరూన్ కలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షర్ట్‌‌‌‌‌‌‌‌ వేసుకుని, తీక్షణమైన చూపులతో చాలా సీరియస్‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తున్నాడు రవితేజ. మరి రామారావుగా ఎలా ఇంప్రెస్ చేస్తాడో వేచి చూడాల్సిందే.