‘రామారావు ఆన్ డ్యూటీ’..త్వరలో కొత్త రిలీజ్ డేట్

‘రామారావు ఆన్ డ్యూటీ’..త్వరలో కొత్త రిలీజ్ డేట్

మాస్ మహారాజా రవితేజ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ విడుదల వాయిదా పడింది. ఇంతకుముందు చేసిన ప్రకటన ప్రకారం ఇది జూన్ 17న విడుదల కావాల్సి ఉండగా, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా విడుదలను వాయిదా వేశారు. ఈమేరకు చిత్ర నిర్మాణ సంస్థ ఆర్టీ టీమ్ వర్క్స్, ఎల్ఎల్వీ సినిమాస్ ట్విటర్ వేదికగా గురువారం ఓ ప్రకటన విడుదల చేశాయి. ఈ సినిమాలో హీరో రవితేజ మండల రెవెన్యూ అధికారి (ఎమ్మార్వో), అసిస్టెంట్ కలెక్టర్ పాత్రలో కనిపించనున్నారు. ప్రజల బాగు కోసం పరితపించే అంకితభావం కలిగిన ప్రభుత్వ అధికారి పాత్రను రవితేజ పోషిస్తున్నారు. దివ్యాంశ కౌశిక్, రాజిశా విజయన్ లు హీరోయిన్లుగా మెరవనున్నారు. కొన్ని వాస్తవిక ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తదుపరిగా విడుదల కాబోయే రవితేజ  సినిమాల్లో ‘ధమాకా’, ‘రావణాసుర’ సినిమాలు క్యూలో ఉన్నాయి.  

మరిన్ని వార్తలు..

ఫ్రెంచ్ ఓపెన్లో నాదల్ జోరు

పూల గౌనులో మెరిసిన దీపిక